twitter
    TelugubredcrumbMoviesbredcrumbVasukibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చక్కగా సాగుతున్న ఓ మహిళ జీవితంలో దారుణ ఘటన చోటుచేసుకొంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. తనకు జరిగిన అన్యాయానికి పగను ఎలా తీర్చుకుంటుంది అనే సింపుల కథను వెండితెర మీద వాసుకీగా మలిచాడు దర్శకుడు ఏకే సాజన్. మమ్ముట్టి, నయనతార దాంపత్య జీవితం, వారి మధ్య ఉన్న ప్రేమానురాలను ఎస్టాబ్లిష్ చేయడానికి తొలి భాగాన్ని దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకొన్నాడు. కానీ తొలి భాగంలో చాలా పేలవంగా సాగడం, కామెడీ లేకుండా మూస ధోరణిలో కథనం ఉండటం కొంత ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నయనతార జరిగిన అన్యాయాన్ని రివీల్ చేసి రెండో భాగంపై ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రెండో భాగంలో నయనతారపై జరిగే రేప్ సన్నివేశాన్ని ఉద్వేగభరితంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆ తర్వాత నయనతార చేసే మూడు హత్యలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమాను మమ్ముట్టి ఎందుకు ఒప్పుకొన్నాడు. ఎలాంటి ప్రధాన్యం లేని భర్త పాత్రను ఎందుకు అంగీకరించాడు అనే ప్రశ్నలు వచ్చే సమయానికి దర్శకుడు మంచి ట్విస్ట్ ఇస్తాడు. అక్కడి నుంచి మమ్ముట్టి పాత్ర పీక్ వెళ్తుంది. కానీ సెకండాఫ్‌లో కథకు తగిన ఎమోషన్స్, భావోద్వేగాలు అంతగా పండకపోవడం వల్ల ఓ యావరేజ్ సినిమా చేస్తున్నామనే ఫిలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా చివరి వరకు ఓ ట్విస్ట్ కోసం ప్రేక్షకుడు వేచి చూడాల్సి రావడం ఈ సినిమాలో ఓ మైనస్ పాయింట్. ఇటీవల వచ్చిన మామ్ సినిమా కూడా ఇలాంటి కథతోనే రూపొందడం మరో మైనస్ పాయింట్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X