»   » వాసుకి మూవీ రివ్యూ: నయనతార వన్ విమన్ షో..

వాసుకి మూవీ రివ్యూ: నయనతార వన్ విమన్ షో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న అందాల తార నయనతార ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్నది. కాష్మోరా, డోరా చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు అద్దపట్టాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మలయాళంలో విజయవంతమైన పుతియా నియామమ్ అనే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి వాసుకిగా విడుదల చేశారు. ఈ చిత్రంలో నయనతార నటనకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్న వాసుకీ చిత్రంలో నయనతార, మమ్మట్టి నటన ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  అన్యాయానికి గురైన మహిళగా..

  అన్యాయానికి గురైన మహిళగా..

  వాసుకీ (నయనతార) కథక్ డ్యాన్సర్. ఆమె భర్త (మమ్ముట్టి) లాయర్, టీవీ యాంకర్. వాసుకీ దంపతులకు ఓ కూతురు ఉంటుంది. చక్కగా దాంపత్య జీవితం సాగుతుంటే వాసుకీ జీవితంలో దారుణమైన సంఘటన చోటుచేసుకొంటుంది. తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు యువకులు వాసుకీని రేప్ చేస్తారు. లైంగిక దాడికి గురైన వాసుకీ భర్తతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుంది. కూతురుతో సరిగా మాట్లాడకుండా తనలో తాను మదనపడుతుంటుంది. ఈ క్రమంలో మహిళ పోలీసు అధికారి పరిచయం అవుతుంది. తనకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని తనతో చెప్పుకుంటుంది. అయితే నిందితులను కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తుంది.
  Nayanthara in Chiranjeevi's film
  జరిగిన దారుణానికి పగ తీర్చుకొనే..

  జరిగిన దారుణానికి పగ తీర్చుకొనే..

  అయితే పోలీసు అధికారి మాటలు వాసుకీకి నచ్చవు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురిని తానే చంపుతాను అని అధికారికి స్పష్టం చేస్తుంది. వాసుకీ బాధను అర్థం చేసుకొన్న మహిళా పోలీసు అధికారి అందుకు ఒప్పుకుంటుంది. కానీ సాక్ష్యాలు లేకుండా వారిని చంపడానికి సహకరిస్తాను అని అండగా నిలుస్తుంది. అలా అధికారి సహకారంతో తనను రేప్ చేసిన ముగ్గురిని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా హతమారుస్తుంది. కానీ పోలీసు అధికారి కాకుండా వేరొకరు ఈ హత్యలలో కీలకమని చివర్లో ట్విస్ట్‌తో సినిమా మరొ మలుపు తిరుగుతుంది. భర్త కాకుండా.. ముగ్గురు హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ ముగ్గురిని మరో వ్యక్తి ఎందుకు చంపాలనుకొంటాడు?. అతడికి వాసుకీ ఏమిటీ సంబంధం? అనే ప్రశ్నలకు సమాధానమే వాసుకీ చిత్రం.


  ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా..

  ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా..

  చక్కగా సాగుతున్న ఓ మహిళ జీవితంలో దారుణ ఘటన చోటుచేసుకొంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. తనకు జరిగిన అన్యాయానికి పగను ఎలా తీర్చుకుంటుంది అనే సింపుల కథను వెండితెర మీద వాసుకీగా మలిచాడు దర్శకుడు ఏకే సాజన్. మమ్ముట్టి, నయనతార దాంపత్య జీవితం, వారి మధ్య ఉన్న ప్రేమానురాలను ఎస్టాబ్లిష్ చేయడానికి తొలి భాగాన్ని దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకొన్నాడు. కానీ తొలి భాగంలో చాలా పేలవంగా సాగడం, కామెడీ లేకుండా మూస ధోరణిలో కథనం ఉండటం కొంత ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నయనతార జరిగిన అన్యాయాన్ని రివీల్ చేసి రెండో భాగంపై ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.


  సెకండాఫ్ ఆసక్తిగా..

  సెకండాఫ్ ఆసక్తిగా..

  రెండో భాగంలో నయనతారపై జరిగే రేప్ సన్నివేశాన్ని ఉద్వేగభరితంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆ తర్వాత నయనతార చేసే మూడు హత్యలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమాను మమ్ముట్టి ఎందుకు ఒప్పుకొన్నాడు. ఎలాంటి ప్రధాన్యం లేని భర్త పాత్రను ఎందుకు అంగీకరించాడు అనే ప్రశ్నలు వచ్చే సమయానికి దర్శకుడు మంచి ట్విస్ట్ ఇస్తాడు. అక్కడి నుంచి మమ్ముట్టి పాత్ర పీక్ వెళ్తుంది. కానీ సెకండాఫ్‌లో కథకు తగిన ఎమోషన్స్, భావోద్వేగాలు అంతగా పండకపోవడం వల్ల ఓ యావరేజ్ సినిమా చేస్తున్నామనే ఫిలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా చివరి వరకు ఓ ట్విస్ట్ కోసం ప్రేక్షకుడు వేచి చూడాల్సి రావడం ఈ సినిమాలో ఓ మైనస్ పాయింట్. ఇటీవల వచ్చిన మామ్ సినిమా కూడా ఇలాంటి కథతోనే రూపొందడం మరో మైనస్ పాయింట్.


  సినిమాకు అంతా తానైన నయన

  సినిమాకు అంతా తానైన నయన

  ఎప్పటిలానే నయనతార వాసుకీ సినిమాను తన భుజాలపై మోసింది. సినిమాకు కర్త, కర్మ, క్రియగా అనే భావనను కలిగించింది. అన్నిరకాల ఎమోషన్స్‌ను బాగా పలికించింది. తనదైన నటనతో పాత్రకు జీవం పోసింది. లైంగికదాడికి గురైన తర్వాత ఆ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది.


  ఇమేజ్‌కు భిన్నంగా..

  ఇమేజ్‌కు భిన్నంగా..

  ఓ మంచి భర్త పాత్రలో తన ఇమేజ్‌కు భిన్నంగా మమ్ముట్టి కనిపించాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి అని చెప్పవచ్చు. అయితే అంతగా ప్రాధాన్యం లేని పాత్రను మమ్ముట్టి ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. క్లైమాక్స్‌లో నాలుగు సీన్లు లేకపోతే ఓ ఆర్డినరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగిపోయేవాడనిపిస్తుదంది. తన పాత్ర పరిధి మేరకు మమ్ముట్టి ఫర్వాలేదనిపించాడు.


  మిగితా పాత్రలు అంత గొప్పగా ఉండవు..

  మిగితా పాత్రలు అంత గొప్పగా ఉండవు..

  వాసుకీలో మిగితా పాత్రల గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. పెద్దగా నటనకు స్కోప్‌లేని పాత్రలే కనిపిస్తాయి. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవడం వల్ల ఆ పాత్రలపై ఆసక్తి కలుగదు.


  రీరికార్డింగ్ హైలైట్

  రీరికార్డింగ్ హైలైట్

  సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి విను థామస్ సంగీతం అందించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది.
  కీలక సన్నివేశాలు హైలెట్ కావడానికి రీరికార్డింగ్ చాలా దోహదపడింది.


  మ్యూజిక్ అదనపు ఆకర్షణ

  మ్యూజిక్ అదనపు ఆకర్షణ

  వాసుకీ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. రోబీ వర్గీస్ రాజ్ అందించిన ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. టాప్ యాంగిల్ షాట్స్ బాగున్నాయి. కేరళలోని పచ్చని వాతావరణాన్ని చక్కగా చిత్రీకరించారు.


  ఎడిటింగ్ మరికొంత..

  ఎడిటింగ్ మరికొంత..

  ఈ చిత్రానికి వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. కాకపోతే తొలి భాగంలో కొంత అనవసరమైన సన్నివేశాలపై దృష్టిపెట్టి ఉంటే బాగుండేదోమో అనిపించింది.


  వాసుకీ

  వాసుకీ

  వాసుకీ చిత్రంపై అప్పట్లో వచ్చిన దృశ్యం ప్రభావం ఉండి ఉండవచ్చు. అయితే దృశ్యం లాంటి సినిమా పక్క స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా తెరకెక్కింది. ఆ సినిమాలో సానుకూలంగా అనిపించే అంశాలు ఇందులో కనిపించవు. కానీ మొత్తంగా హీరోయిన్, కుటుంబ కథా చిత్రాలు ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంటుంది.


  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  నయనతార, మమ్మట్టి యాక్టింగ్
  స్క్రీన్ ప్లే


  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్
  కథ
  ప్రేక్షకులకు పరిచయం లేని నటులు  తెర వెనుక.. తెర ముందు..

  తెర వెనుక.. తెర ముందు..

  నటీనటులు: నయనతార, మమ్ముట్టి, బేబీ అనన్య, శీలూ అబ్రహం తదితరులు
  దర్శకత్వం: ఏకే సాజన్
  నిర్మాత: ఎస్ఆర్ మోహన్
  సంగీతం: గోపి సుందర్
  నిడివి: 2 గంటల 14 నిమిషాలు
  రిలీజ్: 2017 జూలై 28


  English summary
  Directed and written by A K Saajan, Vasuki is a thriller, with a social theme, under the guise of a family movie. What makes the movie stand apart from the usual crop of thrillers is that it's the female protagonist Vasuki, brilliantly portrayed by Nayanthara, who steals the show.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more