X
తెలుగు » సినిమాలు » విన్నర్
విన్నర్

విన్నర్

Action | Romance | 24 Feb 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

విన్నర్ స్టోరీ

విన్నర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, ముఖేశ్ రుషి,  పృథ్వీ, అనసూయ భరద్వాజ్, తాకుర్ అనూఫ్ సింగ్,  వెన్నెల కిశోర్, అలీ  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపీచంద్ మలినేని నిర్వహించారు మరియు నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ యస్ స్వరాలు సమకుర్చరు.   కథ హార్స్‌ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). మహేందర్ రెడ్డి (జగపతి బాబు) ఇండియాలోనే బెస్ట్ జాకీ. వందల కోట్ల ఆస్తులకు వారసుడు. అవన్ని కాదనుకొని తను ప్రేమించిన అమ్మాయి కోసం తండ్రి (ముఖేష్ రుషి)ని ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఆయన కొడుకే సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌). కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తరువాత భార్య చనిపోవటంతో కొడుకు సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. ఈ లోగా మహేందర్ రెడ్డి తండ్రికి బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. వరుసగా తాము బెట్టింగ్ వేసిన గుర్రాలు ఓడిపోతుండటంతో మహేందర్ రెడ్డి వస్తేనే తిరిగి బిజినెస్ లాభల్లోకి వస్తుందని పార్టనర్స్ ఒత్తిడి చేస్తారు. కానీ మనవడిని మాత్రం తన కొడుకు నుంచి ఎలాగైన దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. అ నుకున్నట్టుగా తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచి సిద్ధార్థే, తండ్రి మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు. తండ్రి రేసుల కారణంగా తనకు దూరమయ్యాడన్న కోపంతో నాన్న అన్నా, గుర్రాలన్నా, రేసులన్నా ద్వేషం పెంచుకుంటాడు సిద్ధార్థ్. తన తండ్రిపై ద్వేషం పెంచుకుని ఇంట్లోంచి పారిపోయిన సిద్దార్ద...20 ఏళ్ల తరువాత సిద్ధార్థ్ న్యూ లుక్ పత్రికలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక పార్టీలో కలిసిన రేసర్ సితారతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ సితార మాత్రం తన గోల్ గురించి చెప్పి సిద్ధార్థ్ ప్రేమను కాదంటుంది. ఆ కోపంతో సితార రన్నింగ్ కాంపిటీషన్ కు రెడీ అవుతున్న విషయం వాళ్ల ఇంట్లో చెప్పేస్తాడు. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్‌).. నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్‌ అనూప్‌సింగ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్‌ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు. పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్న సితార.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్ ను ప్రేమించానని.. అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. అంతటితో ఆగకుండా ...వీరు తీసుకువచ్చిన పెళ్లి కొడుకు తన ప్రియుడితో రేసులో గెలవాలని పందెం కాసి ఇరికిస్తుంది. అదే సమయంలోనే ఈ పోటీలో త‌న‌ కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు సిద్ధార్థ్‌. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. అలాగే..సితార ప్రేమ కోసం అనుకోకుండా పందెంలోకి దిగిన సిద్దార్థ్ ను గెలవకుండా చేయడానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాకీ అయిన ఆది అడ్డుపడుతుంటాడు. అదే సమయంలో సిద్దార్థ్ తను చిన్నతనంలో దూరమైన తండ్రి ప్రేమను గెలుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇలా సితార ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం రేసుకు దిగిన సిద్దార్థ్ తనకు అడ్డుపడుతున్న ఆదిని ఎలా ఎదుర్కొంటాడు ? అసలు ఆది ఎవరు ? మరి గుర్రాలంటే పడని సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? సితారను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? సిద్ధార్ధ్, తిరిగి తండ్రి మహేందర్ రెడ్డి దగ్గరకు చేరుకున్నాడా..? అన్నదే మిగతా కథ. 
Read More

విన్నర్ కాస్ట్ & క్రూ

విన్నర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపిచంద్ మలినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి, మధు బి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విన్నర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కమర్షియల్ హీరోలు రొటీన్ కథలే ఎంచుకోవాలని ఏదన్నా రూల్ పెట్టుకున్నారో ఏమో ఎన్నో సార్లు తెరకెక్కిన పాయింట్ నే అటు తిప్పి ఇటు తిప్పి , బ్యాక్ డ్రాప్ మార్చి వదులుతున్నారు. ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ సైతం అదే స్కూల్ లో ప్రయాణిస్తూ...విన్నర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు.

విన్నర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విన్నర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+