»   » మరీ ఇంత మార్పా..!? జవాన్ కోసం మారిన సాయి ధరమ్ తేజ్

మరీ ఇంత మార్పా..!? జవాన్ కోసం మారిన సాయి ధరమ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"విన్నర్' ప్రమోషన్ల లో కనిపించిన తర్వాత నెమ్మదిగా మీడియా కళ్ళకి కాస్త దూరం జరిగాడు సాయి ధరమ్ తేజ్. ఇక సినిమా సంగతి అర్థమైపోగానే ప్రమోషన్ల అవసరం లేదనుకున్నాడేమో. సైలెంట్గా ఉండిపోయాడు. లేదు సైలెంట్ గా ఉన్నాడనే ఫీలింగ్ లోనే అందరినీ ఉంచాడు గానీ తాను మాత్రం విన్నర్ ఫెయిల్యూర్ ని ఏమాత్రం లెక్ఖ చేయకుండా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో 'జవాన్' మొదలుపెట్టేశాడు.

మొత్తం ఫేస్ కట్టే మారిపోయింది.

మొత్తం ఫేస్ కట్టే మారిపోయింది.

మరి జవాన్ అంటే కాస్త ఫిట్ గా, రఫ్ గా కనిపించేలా లుక్ రావాలి కదా అందుకే కొత్త లుక్ లోకి వచ్చేసాడు. హేర్ స్టైల్ తో పాటు మొత్తం ఫేస్ కట్టే మారిపోయింది. ఈ కొత్త లుక్ లోనే తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యాడు తేజు. శాంసంగ్ గెలాక్సీ-8 ఆవిష్కరణ కార్యక్రమంలో అతను తళుక్కుమన్నాడు.

హిట్ చాలా కీలకం

హిట్ చాలా కీలకం

అక్కడ తేజును చూసిన వాళ్లందరూ కొంత ఆశ్చర్యపోయారు. మొత్తంగా అసలు రూపమే మారిపోయిందంటూ మెచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడు సాయిధరమ్ కెరీర్ కు ‘జవాన్' తో వచ్చే హిట్ చాలా కీలకం అవసరం కూడా. వరుసగా ‘తిక్క',‘విన్నర్' సినిమాలతో షాకుల మీద షాకులు తిన్నాడు తేజు.

పడ్డ దెబ్బలు గట్టిగానే ఉన్నాయి

పడ్డ దెబ్బలు గట్టిగానే ఉన్నాయి

కథలని ఎంచుకోవటం లో దెబ్బతింటున్నా అని ఇప్పటికే అర్థమైపోయింది. ఇప్పటికే పడ్డ దెబ్బలు గట్టిగానే ఉన్నాయి. ఈ టైం లో గనక ఇంకో ఫ్లాప్ పడిందంటే మాత్రం బాగా వెనుకబడిపోతాడు. అసలే ఈ మధ్య కాలం లో యువ హీరోల మధ్య ఉన్న పోటీ కూడా తక్కువేం లేదు.

బి.వి.ఎస్.రవికి కూడా కీలకమే

బి.వి.ఎస్.రవికి కూడా కీలకమే

ఈ సినిమా దర్శకుడు బి.వి.ఎస్.రవికి కూడా కీలకమే. తొలి సినిమా ‘వాంటెడ్' దెబ్బకు మళ్లీ చాలా ఏళ్ల పాటు మెగా ఫోన్ పట్టే అవకావం రాలేదతడికి. ఈసారి తనేంటో రుజువు చేసుకోకుంటే దర్శకుడిగా ఇంకో అవకాశం దక్కడం కష్టమే. మరి ‘జవాన్' వీళ్లిద్దరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.

దేశానికే మొదటి ప్రాముఖ్యత

దేశానికే మొదటి ప్రాముఖ్యత

ఈ సినిమాలో సాయధరమ్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఈ యంగ్ హీరో ఖండించాడు. ఈ చిత్రంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా, దేశ భక్తుడి పాత్రను పోషిస్తున్నానని తెలిపాడు. దేశం-కుటుంబం..ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే పరిస్థితి తలెత్తే ఓ సన్నివేశం ఈ చిత్రంలో ఉంటుందని, అప్పుడు హీరో దేశానికే మొదటి ప్రాముఖ్యతను ఇస్తాడని సాయి ధరమ్ చెప్పాడు.

English summary
Talking about Tej’s character, director Ravi said: “He plays a patriot. In a conflict between country and family, he chooses the former. The character will require him to shed weight and undergo a special makeover.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu