For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu5 విజేత అతడే.. షణ్ముఖ్ గెలిస్తే వారి మాయే..యాంకర్ రవి బలి..కార్తీకదీపం ఉమాదేవి హాట్ కామెంట్స్

  |

  తెలుగు బుల్లితెరపైన అత్యంత టాప్ సీరియల్ కార్తీకదీపం సీరియల్‌లో భాగ్యం అలియాస్ అర్ధపావు భాగ్యం పాత్రలో ఉమాదేవి అద్భుతంగా నటించి మెప్పించారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె బిగ్‌బాస్‌ తెలుగు 5లో కంటెస్టెంట్‌గా మారారు. కొన్నిసార్లు షోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఆమె మందలింపునకు గురయ్యారు. అయితే తాజాగా యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత మీడియాతో ఆమె మాట్లాడుతూ..

  యాంకర్ రవి బలి అంటూ

  యాంకర్ రవి బలి అంటూ

  నా మనసు చెప్పినట్టు నేను ఓపెన్‌గా మాట్లాడుతాను. ఎవరి ఫ్యాన్స్ ఏమనుకొన్నా నాకేం భయం లేదు. డెఫినెట్‌గా యాంకర్ రవి టాప్ 5 జాబితాలో ఉండే కంటెస్టెంట్. కానీ గేమ్ ఛేంజ్ చేయడానికి నిర్వాహకులు ఓ ప్లాన్ చేశారు. రవిని బుట్టలోకి దించారు. దాంతో ఆయన బలైపోయారు. ఓటింగ్ నిజమా? ఫేకా అనేది మనకు తెలియదు. ఎప్పుడు అఫీషియల్‌గా బయటపెట్టరు కాబట్టి నేను దానిపై కామెంట్ చేయలేను. అన్ అఫీషియల్‌గా చెప్పేవే నమ్మాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అని బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఉమాదేవి అన్నారు.

  స్క్రిప్టింగ్ ప్రకారమే రవి ఎలిమినేషన్

  స్క్రిప్టింగ్ ప్రకారమే రవి ఎలిమినేషన్

  యాంకర్ రవి ఎలిమినేషన్ షాకింగ్‌గా ఉంది. ఆయన ఎలిమినేషన్‌ను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం. రవి ఎలిమినేషన్ చూస్తే తర్వాత ఎవరు బయటకు వస్తారో చెప్పడం కష్టం. బిగ్‌బాస్ షో స్క్రిప్టింగ్ కాదు. టాస్కులన్నీ రియల్‌గా జరుగుతాయి. ఎలిమినేషన్ స్క్రిప్టింగా? లేదా అనేది తెలియదు. ఆయన స్క్రిప్టింగ్ కాబట్టే యాంకర్ రవి బయటకు వచ్చాడు అని కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

  వీజే సన్నీ పాస్ ఉపయోగించడంపై

  వీజే సన్నీ పాస్ ఉపయోగించడంపై

  వీజే సన్నీ ఎవిక్షన్ పాస్ వాడుకోవడమనేది ఆయన ఇష్టం. వాస్తవానికి ఆయన వాడుకోవాలి. ఆర్జే కాజల్ వల్ల సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. అయితే 12వ వారం ఎలిమినేషన్‌లో రవి, కాజల్ ఉన్నారు. వారిలో ఎవరు సేఫ్ అవుతారో చెప్పలేం. కాబట్టి.. కాజల్‌ను కాపాడేందుకు సన్నీ తన పాస్‌ను వాడారు. అయితే దాని వల్ల ఉపయోగం లేకపోయిందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు అని ఉమాదేవి పేర్కొన్నారు.

  టాప్ 5లో ఆర్జే కాజల్ గ్యారెంటీ

  టాప్ 5లో ఆర్జే కాజల్ గ్యారెంటీ

  సిరి హన్మంతు, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్‌లో టాప్ 5లోకి ఎవరు వస్తారనే ప్రశ్నకు ఉమాదేవి సమాధానం ఇస్తూ.. ఆర్జే కాజల్ టాప్ 5లో ఉంటారు. కాజల్ గేమ్ ఛేంజర్. ఆమెకు గేమ్‌ను ఎలా ఛేంజ్ చేయాలో తెలుసు. ఆమెనే టాప్ 5లోకి వస్తుంది అని ఉమాదేవి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.

  విజే సన్నీ విన్నర్.. షణ్ముఖ్ గెలిస్తే అంతే..

  విజే సన్నీ విన్నర్.. షణ్ముఖ్ గెలిస్తే అంతే..

  బిగ్‌బాస్ తెలుగు 5 విజేత ఎవరంటే.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి వీజే సన్నీ విన్నర్. షన్ను గురించి ఏ మాట్లాడను. ఎవరేమనుకొన్నా నాకు ఫర్వాలేదు. షణ్ముఖ్ జస్వంత్ గెలుస్తారా? లేదా అంటే.. ఆయన ఇంకా గేమ్‌లో ఓపెన్ కాలేదు. నేను ఇంటిలో ఉన్నప్పుడే చెప్పాను. షణ్ముఖ్ ఓపెన్ అయి గేమ్ ఆడమని చెప్పాను. కానీ ఇంకా ఆయన అదే పద్దతిలో ఆడుతున్నాడు. ఒకవేళ షణ్ముఖ్ జస్వంత్ గెలిచాడంటే.. బిగ్‌బాస్ నిర్వాహకులే అందుకు కారణం అంటూ ఉమాదేవి అభిప్రాయపడ్డారు.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  ఉమాదేవి గురించి విషయాలు

  ఉమాదేవి గురించి విషయాలు

  ఇక ఉమాదేవి విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తెలుగు 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే కొద్ది వారాలు ఉన్న ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అయితే యాంకర్ రవి ఎలిమినేషన్‌ విషయంలో ఆమె షాక్ గురైనట్టు కనిపించారు.

  English summary
  Karthik Deepam fame and Bigg Boss Telugu 5 contestant Uma Devi shocking on Anchor Ravi elimination. Uma Devi predicts Bigg Boss Telugu 5 Winner as VJ Sunny.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X