రాజ్ తరుణ్ ‘లవర్’.... అద్భుతం సాంగ్ మేకింగ్ వీడియో!

By Bojja Kumar

రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ‌ర్‌. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 'అద్భుతం సాంగ్' మేకింగ్ వీడియో విడుదల చేశారు. పాటను కేరళలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Adbhutam Song Making form Lover Movie

ప్రేమ‌లోని స‌రికొత్త కోణాన్ని ట‌చ్ చేస్తూ అనీశ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. పోనీ టెయిల్‍‌లో రాజ్ తరుణ్ సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చారు. దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో వరుస ప్లాపులతో ఉన్న ఈ యంగ్ హీరో ఈ సారి గట్టెక్కడం ఖాయం అని భావిస్తున్నారు.

కెమెరా: స‌మీర్ రెడ్డి, మ్యూజిక్‌: అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌: జె.బి, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, స్టంట్స్‌: విజ‌య్‌, వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి, నిర్మాత: హ‌ర్షిత్ రెడ్డి, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X