‘అల.. వైకుంఠపురములో’ అరుదైన రికార్డు: దక్షిణాదిలోనే మొదటి చిత్రంగా ఘనత

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. 2020లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

కమెడియన్ వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ తారలు.. కంటతడి పెట్టిన కీర్తి సురేష్

ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో 'అల.. వైకుంఠపురములో' ఆల్బమ్‌కు శ్రోతల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాలోని అన్ని పాటలకు భారీ స్థాయిలో క్లిక్కులు వచ్చాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ సినిమాలోని లిరికల్, వీడియో సాంగ్స్‌కు అత్యధిక వ్యూస్ రావడంతో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలోని పాటలన్నీ కలిపి 2 బిలియన్‌ (200 కోట్లు) వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించాయి. దక్షిణాదిలో ఇప్పటి వరకు ఏ సినిమాకూ ఈ రికార్డు దక్కలేదు.

 Ala Vaikunthapurramloo Album Hits 2 Billion Streams On Youtube

సాంగ్స్ పరంగా చూసుకుంటే.. ఇప్పటి వరకు సామజవరగమన పాటకు 434 మిలియన్లు, రాములో రాములాకు 704 మిలియన్లు, బుట్టబొమ్మకు 736 మిలియన్లు, ఓ మై గాడ్ డాడీకి 73 మిలియన్లు, టైటిల్ సాంగ్‌కు 34 మిలియన్లు, సిత్తరాల సిరపడు సాంగ్‌కు 91 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తంగా 2072 మిలియన్లను సొంతం చేసుకుందీ ఆల్బమ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించగా.. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరాం తదితరులు నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X