For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాలీవుడ్‌లో ఆ ఫీట్ అందుకున్న బన్నీ.. కింగ్ ఆఫ్ సోషల్‌మీడియా అంటూ కామెంట్లు

|
#Samajavaragamana : Unstoppable on YouTube || బాహుబలి రికార్డు ఢమాల్

ఒకే ఒక్క సాంగ్.. సోషల్ మీడియాకు నిద్రపట్టకుండా చేస్తోంది... యూట్యూబ్‌ను నిరంతంర ఉరకలెత్తిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలన అంటూ రిలీజ్ చేసిన పాట.. రికార్డులు కొల్లగొట్టకుండా ఉండగలనా అంటోంది.

సిద్ శ్రీరామ్ గాత్రంతో

సిద్ శ్రీరామ్ గాత్రంతో

సిద్ శ్రీరామ్ గాత్రం ఈ మధ్య యూత్‌ను తెగ ఆకర్షిస్తోంది. గీతగోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే పాట అయినా.. టాక్సీవాలా మూవీలోని మాటే వినదుగా సాంగ్ అయినా.. హుషారు చిత్రంలోని ఉండిపోరాదే అనే పాట అయినా యూత్‌ను కట్టిపడేశాయి. అన్నీ కూడా సెన్సేషన్‌గా మారిపోయి.. ఒక్కసారిగా సిద్ శ్రీరామ్ పేరు మార్మోగిపోయేలా చేశాయి. తాజాగా అలవైకుంఠపురములో నుంచి సామజవరగమన అనే పాటను ఆలపించాడు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

డబ్బింగ్‌తో సోషల్ మీడియా స్టార్...

డబ్బింగ్‌తో సోషల్ మీడియా స్టార్...

అల్లు అర్జున్ సినిమాలు హిందీలో డబ్ అవుతూ ఉంటాయి. అవి ఇక్కడి వాటి కంటే ఎక్కువ వ్యూస్‌ను సాధిస్తూ ఉంటాయి. రేసుగుర్రం, సరైనోడులాంటి చిత్రాలు ఈజీగా వంద మిలియన్లను క్రాస్ చేశాయి. ఇలా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడం బన్నీకి కొత్తేం కాదు. అయితే మరో సారి ఒకే ఒక్క పాటతో దుమ్ము దులుపుతున్నాడు.

40మిలియన్ల వ్యూస్.. 700kల లైక్స్‌తో..

40మిలియన్ల వ్యూస్.. 700kల లైక్స్‌తో..

ఇప్పటికే ఈ పాటను సోషల్ మీడియాలో 40 మిలియన్ల మంది వీక్షించారు. 700లైకులతో మరో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం.. తమన్ అందించిన బాణీ ఈ పాటను అంతగా నచ్చేలా చేశాయి. ఇక ఇప్పటికే ఎంతోమంది రింగ్ టోన్, కాలర్ టోన్‌గా పెట్టుకుని ఆస్వాధిస్తున్నారు.

సోషల్‌మీడియాకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..

తెలుగులో మోస్ట్ లైక్డ్ సాంగ్‌గా దూసుకుపోతోన్న ఈ పాటను ఇంతగా ఆదరించినందుకు గానూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

ఇదే ప్రథమం..

ఇదే ప్రథమం..

ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రథమం.

అల వైకుంఠపురములో ని తారలు:

అల వైకుంఠపురములో ని తారలు:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

సాంకేతిక నిపుణులు:

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

English summary
Allu Arjun And Trivikram Ala Viakunthapuramulo Movies First Single Samajavaragamana Released. which is sung by Sid Sriram And Composed By Thaman. Lyrics By Sirivennela sithrama sasthry. Pooja Hegde Acts As female lead.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more