For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్: ఇండియాలో ఎనిమిదో స్థానం.. సౌత్‌లో ఏకైక హీరోగా రికార్డు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా నిర్మాత కొడుకుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా స్టార్ స్టేటస్‌తో పాటు ఎంతో మంది అభిమానులనూ సంపాదించుకున్నాడు. బన్నీకి తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో చాలా వరకూ ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడికి సంబంధించిన ప్రతి దానికి అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తద్వారా సౌతిండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే..

  ‘అల.. వైకుంఠపురములో' అని వచ్చాడు

  ‘అల.. వైకుంఠపురములో' అని వచ్చాడు

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత వీళ్ల కాంబోలో ఈ చిత్రంతో హ్యాట్రిక్ నమోదైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. టబు, సుశాంత్, నివేదా, సముద్రఖని, మురళీ శర్మ కీలక పాత్రలు చేశారు. దీనికి థమన్ సంగీతం అందించాడు.

  కెరీర్‌లోనే మొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

  కెరీర్‌లోనే మొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

  ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దాదాపు రూ. 130 కోట్ల షేర్‌ను అందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫలితంగా ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది.

  సినిమానే కాదు.. ఆల్బమ్ కూడా హిట్టే

  సినిమానే కాదు.. ఆల్బమ్ కూడా హిట్టే

  ‘అల.. వైకుంఠపురములో' ఆల్బమ్‌కు శ్రోతల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాలోని అన్ని పాటలకు భారీ స్థాయిలో క్లిక్కులు వచ్చాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ సినిమాలోని లిరికల్, వీడియో సాంగ్స్‌కు అత్యధిక వ్యూస్ రావడంతో ఎన్నో రికార్డులు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ ఆల్బమ్ 2 బిలియన్‌ (200 కోట్లు) వ్యూస్‌ దాటేసింది.

  బుట్టబొమ్మకు మరింతగా.. హైలైట్లు ఇవే

  బుట్టబొమ్మకు మరింతగా.. హైలైట్లు ఇవే

  ‘అల.. వైకుంఠపురములో'లోని పాటలకూ విశేషమైన స్పందన వస్తే.. ‘బుట్ట బొమ్మ' సాంగ్ మాత్రం మరింత ఎక్కువ ఆదరణను అందుకుంది. ఇప్పటికే ఈ పాటకు ఎన్నో అవార్డులు దక్కాయి. దీనికి కారణం థమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్.. అమ్రాన్ మాలిక్ గొంతు.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నింటికీ మించి అల్లు అర్జున్ - పూజా హెగ్డే గ్రేస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
  అన్నింటికంటే అత్యధిక వ్యూస్ వచ్చాయి

  అన్నింటికంటే అత్యధిక వ్యూస్ వచ్చాయి

  ‘బుట్ట బొమ్మ' పాటకు ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో 615 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, మిగిలిన అన్ని డిజిటల్ మీడియాల లెక్కల ప్రకారం.. దాదాపు 750 మిలియన్లకు పైగానే వ్యూస్ దక్కాయి. తెలుగులో ఈ పాటే ఇప్పటి వరకూ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే, దక్షిణాదిలోని పాటల జాబితాలో టాప్ -5లో చోటు దక్కించుకుంది. దీంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది.

  వీడియోతో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

  వీడియోతో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

  ‘అల.. వైకుంఠపురములో' చిత్రంలోని ‘బుట్ట బొమ్మ' పాటకు వ్యూస్ మాత్రమే కాదు.. లైకులు కూడా విపరీతంగా వచ్చాయి. దీంతో తాజాగా ఇది 4 మిలియన్ మార్కును చేరుకుంది. అంటే ఈ పాటను ఇష్టపడిన వారి సంఖ్య అక్షరాల నలభై లక్షల మంది. తెలుగులో ఇన్ని లైకులు ఏ హీరోకూ రాలేదు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రను సృష్టించాడు అల్లు వారి అబ్బాయి.

  ఇండియాలో ఎనిమిది.. సౌత్‌లో మొదటిది

  ఇండియాలో ఎనిమిది.. సౌత్‌లో మొదటిది

  బుట్టబొమ్మ పాటకు 4 మిలియన్ లైకులు రావడంతో పలు రికార్డులను అందుకున్నాడు అల్లు అర్జున్. ఇండియాలోనే ఎక్కువ లైకులు సాధించిన పాటల జాబితాలో ఇది ఎనిమిదో స్థానానికి చేరుకుంది. అలాగే, సౌత్‌లో ‘రౌడీ బేబీ' తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, ఆ పాట కంటే వేగంగానే 4 మిలియన్ లైకులు దక్కించుకుంది. తద్వారా బన్నీ సౌత్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.

  English summary
  Allu Arjun Ala Vaikunthapurramuloo Movie album Received huge Response From Music Lovers. Now Butta Bomma Song Got 4 Million Likes in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X