పుష్ప కోసం ఆ పని పూర్తి చేసిన దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ టేస్టుకు తగ్గట్లుగానే
టాలీవుడ్ బిగ్గెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా రాబోతోంది అన్నప్పటి నుంచి కుడా అంచనాల డోస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. దర్శకుడు సుకుమార్ మూడవసారి స్టైలిష్ స్టార్ అర్జున్ తో చేస్తున్న సినిమా కాబట్టి అతన్ని మరింత డిఫరెంట్ గా చూపించనున్నట్లు ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక సినిమా షూటింగ్ దాదాపు సగానికి సగం పూర్తయిన తరువాత గాని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన రాలేదు. నిడివి ఎక్కువవ్వడంతో ఎడిట్ లో కట్ చేయలేక చివరికి బాహుబలి ఫార్మాట్ లోనే హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాలో ఐటెమ్ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే పాటను పూర్తి చేసినట్లు సమాచారం.

సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ అనగానే మ్యూజిక్ పక్కా హిట్ టాక్ ను అందిస్తుంది. ఇక వీరి సినిమా ఎలా ఉన్నా కూడా పక్కా ఒక ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. పుష్పలో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఐటెమ్ సాంగ్ ను కంపోజ్ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ ఎలా ఉంటుందనేది ఊహలకు అందడం లేదు. పూజా హెగ్డే లేదా దిశా పటాని వంటి స్టార్ హీరోయిన్స్ తో ఐటెమ్ సాంగ్ చేయించాలని అనుకుంటున్నారు. మరి దేవిశ్రీప్రసాద్ అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











