రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కు అదిరిపోయే కానుక ఇచ్చిన అల్లు అర్జున్!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి సినిమా చేసినా కూడా కాన్సెప్ట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అగ్ర హీరోలతో కూడా రాక్ స్టార్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందులో అల్లు అర్జున్ తో ఉండే ఫ్రెండ్షిప్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ఇప్పుడు అందరి చూపు పుష్ప పైనే ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో మ్యూజిక్ మంచి హైప్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే పుష్ప కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసిన దేవికి బన్నీ ప్రత్యేకమైన కానుక ఇచ్చాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అనే డిజైన్ తో లైటీంగ్ బోర్డుని ఇచ్చాడు. ఇక సోషల్ మిడియా ద్వారా నెటిజన్లకు చూపించిన రాక్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతే కాకుండా లవ్యూ అంటూ పుష్ప సాంగ్స్ త్వరలోనే సందడి చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. మరి ఆ సాంగ్స్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 250కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే టీజర్ తో సినిమాను నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యేలా చేశారు.

చూస్తుంటే బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ ను ఈ ఎడాది చివరలో విడుదల చేసి వచ్చే ఏడాది పార్ట్ 2 ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











