For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  AR Rahman: అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్.. దుమారం రేపుతున్న ఏఆర్ రెహ్మాన్ ట్వీట్

  |

  సాధారణంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద అంశాల మీద పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఏ ఆర్ రెహమాన్ కౌంటర్ ఇచ్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  హిందీ భాష గురించి

  హిందీ భాష గురించి

  కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత గా వ్యవహరిస్తున్న అమిత్ షా ఇటీవల హిందీ భాష గురించి కొన్ని కామెంట్స్ చేశారు. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశ సమైక్యత సాధనలో అధికార భాష కీలక పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని చెప్పారు.

  స్థానిక భాషల తరువాత ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా అన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది భారతీయ భాష అయి ఉండాలని అమిత్‌ షా అన్నారు.

  పరోక్షంగా కౌంటర్

  పరోక్షంగా కౌంటర్

  అంతే కాక ప్ర‌భుత్వం ఖచ్చితంగా హిందీకి ప్రాముఖ్యత ఇస్తుందని ప్ర‌క‌టించారు. హిందీ నిఘంటువును సవరించాల్సి న అవసరం ఉందని, విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, హిందీ బోధన, పరీక్షలపైనా మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు నుంచి కాక దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక రాజకీయపరంగా విమర్శల దాడి గురించి అయితే చెప్పక్కర్లేదు కానీ ఎక్కువ ఇలాంటి విషయాలకు దూరంగా ఉండే ఏ ఆర్ రెహమాన్ ఈ విషయంలో పరోక్షంగా కౌంటర్ వేయడం చర్చనీయాంశమైంది.

  దేవత పెయింటింగ్ ను

  దేవత పెయింటింగ్ ను

  తాజాగా ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. మా ప్రియమైన తమిళం అంటూ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ మూడింటిలోనూ ఒక ఫోటో పోస్ట్ చేశారు. తమిళ దేవత గా భావించే తమిళనాంగు అనే ఒక దేవత పెయింటింగ్ ను ఆ ఫోటోలో పోస్ట్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ కంపోజ్‌ చేయగా మనోమణియమ్‌ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని ఒక వాక్యాన్ని కూడా ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్‌ రెహమాన్‌.

  ప్రియమైన తమిళం అంటూ

  ప్రియమైన తమిళం అంటూ

  మన ఉనికికి మూలం ప్రియమైన తమిళం అంటూ 20వ శతాబ్దపు తమిళ కవి భరతిదశన్‌ రాసిన 'తమిళియక్కమ్‌' కవితా సంకలనంలోని ఓ లైన్‌ను కూడా ఆ ఫొటోపై క్యాప్షన్‌గా ఉంచారు. ఇందులో ఎక్కడా కూడా వేరే భాషను కించపరిచే విధంగా లేకపోతే అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నట్లుగా లేదు కానీ ఆయన చేసిన కామెంట్లు కచ్చితంగా అమిత్ షా చేసిన కామెంట్లకు కౌంటర్ గానే కొంతమంది భావిస్తున్నారు.

  పెద్ద ఎత్తున దుమారం

  పెద్ద ఎత్తున దుమారం

  ఎందుకంటే రెహమాన్‌ ఇలా భాషకు సంబంధించి జూన్‌ 2019లో కూడా వ్యతిరేకించారు . ప్రతి రాష్ట్రంలోనూ మూడు భాషల పాలసీ తప్పనిసరి చేయాలని కేంద్రం ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆ టైంలో 'అటానమస్‌' కేంబ్రిడ్జి డిక్షనరీలోని పదం అంటూ ట్వీట్‌ చేసి.. #autonomousTamilNadu అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఇప్పుడు కూడా ఆయన అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. ఈ అంశం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

  English summary
  AR Rahman Counter Tweet On Amit Shah Hindi Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X