Don't Miss!
- News
దానిని మేం కాదనడంలేదుగా: సజ్జల రామకృష్ణారెడ్డి
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy క్రేజీ అప్డేట్.. 'మాస్ మొగుడు' సాంగ్ రిలీజ్, నాన్న గారి జీన్స్ అంటూ!
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ నటించింది. బాలకృష్ణ-శ్రుతి హాసన్ కాంబినేషన్ లో ఇప్పటికే సుగుణ సుందరి అనే పాట విడుదలై తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు మరో మాస్ నెంబర్ ను విడుదల చేశారు. అయితే మూవీ ట్రైలర్ కన్నా ముందు విడుదల చేయాల్సిన ఈ పాటను రూటు మార్చి జనవరి 9న అంటే సోమవారం రిలీజ్ చేశారు. మాస్ మొగుడు పాట వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్ లో ట్రెండింగ్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు పాటలకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. మా బావ మనోభావాలు పాటకు అయితే ఇప్పటికే కోటికిపైగా వ్యూస్ రాగా.. 1.6 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో మూడవ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా మరో మాస్ నెంబర్ మాస్ మొగుడు పాటను విడుదల చేశారు.

నాన్న గారి జీన్సో జీన్స్..
యాంది రెడ్డి యాంది రెడ్డి.. ఎక్కడైనా నీదే జోరు.. అంటూ ఫుల్ మాసీగా సాగింది ఈ పాట. అలాగే పుట్టుకతోటే నాలో ఉన్నాయి నాన్న గారి జీన్సో జీన్స్.. సేమ్ టు సేమ్ ఆ కటౌట్టే మనకు రిఫరెన్స్ అంటూ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సింగర్ మనో, రమ్య బెహర ఆలపించారు. ఇక ఎస్ఎస్ తమన్ మాస్ బీట్ ఉర్రూతలూగించేలా ఉంది. పాట విజువల్స్ పరంగా కూడా చాలా అందంగా ఉంది. శ్రుతి హాసన్ డ్రెస్సింగ్, మేకప్ స్టైల్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అలాగే ఈ పాటకోసం వేసిన సెట్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

ట్రైలర్ కంటే ముందుగా..
అయితే మాస్ మొగుడు అంటూ సాగే ఈ పాటను జనవరి 3నే విడుదల చేద్దామనుకున్నారు. కానీ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ట్రైలర్ విడుదల చేశాక ఈ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే జనవరి 9 సోమవారం రాత్రి 7:35 నిమిషాలకు సోషల్ మీడియా వేదికగా వదిలారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే కన్నడ హీరో దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ గా సందడి చేయనున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.