Don't Miss!
- News
తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 2.73 శాతం డీఏ మంజూరు
- Sports
Womens IPL టీమ్స్ వేలం.. రేసులో బడా కంపెనీలు! బీసీసీఐకి రూ.4 వేల కోట్లు!
- Lifestyle
ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
కొవ్వు తగ్గించుకోకపోతే 6 నెలల్లో చస్తావని చెప్పారు.. 130 కేజీల బరువు ఎలా తగ్గానంటే.. అద్నాన్ సమీ
ప్రపంచవ్యాప్తంగా మంచి సింగర్ గా గుర్తింపు అందుకున్న సింగర్స్ లలో అద్నాన్ సమీ ఒకరు. ఆయన ఎలాంటి పాట పాడిన కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విభిన్నమైన వాయిస్ తో మంచి పార్టీ సాంగ్స్ తో పాటు రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా పాడగలరు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రముఖ సింగర్ తన జీవితంలోని ఒక కఠినమైమ విషయం గురించి చెప్పాడు. తక్కువ టైమ్ లో 130 కేజీల బరువు తగ్గినట్లు వివరణ ఇచ్చాడు. ఆ వివరాలు లోకి వెళితే..

పాకిస్థాన్ సింగర్
సింగర్ గా అతి చిన్న వయసులోనే మంచి క్రేజ్ అందుకున్న అద్నాన్ సమీ పాకిస్తాన్ లో పుట్టి పెరిగాడు. అయితే అతనికి ఆ దేశంలో కంటే కూడా ఇండియాలోనే సింగర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో పడే అవకాశం వస్తూ ఉండడంతో అతను భారత్ లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు అతను భారత పౌరసత్వాన్ని తీసుకున్నాడు.

అధిక బరువు కారణంగా..
అయితే ఈ సింగర్ పర్సనల్ లైఫ్ లో చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అతను రెండు సార్లు విడాకులు కూడా తీసుకున్నాడు. సమీ ఒక సమయంలో అయితే అధిక బరువు కారణంగా అనేక రకాల వ్యాధుల బారిన పడ్డాడు ఇక అతను బ్రతకడం కూడా కష్టమేమి వైద్యులు కూడా కొన్నిసార్లు సూచించడంతో కొంత కాలం వరకు డిప్రెషన్ కు గురయ్యాడు.

చనిపోతావు అన్నారు
ఇక సమీ ఇటీవల ఒక విషయాన్ని తెలియజేశాడు. సమీ మాట్లాడుతూ.. నేను లండన్ లో డాక్టర్ ను కలిసినప్పుడు 200 కేజీలు ఉన్నాను. అప్పుడు ఆయన ఊహించని విధంగా ఒక మాట అన్నారు. నువ్వు మరో ఆరు నెలల్లో నీ హోటల్ రూమ్లో చనిపోయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. నీ పరిస్థితి అంత దారుణంగా మారే అవకాశం ఉందని ఆయన ఊహించని విధంగా హెచ్చరించడం ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా సమీ తెలిపాడు.

తండ్రి ఆవేదన
డాక్టర్ మాట్లాడేటప్పుడు మా తండ్రి కూడా ఉన్నారు. నా తండ్రి బాధతో చాలా ఎమోషనల్ అయిపోయారు. నీకు అలా జరగకూడదు అని ఎప్పుడైనా సరే ఒక తండ్రి తన కొడుకు అంత్యక్రియలు చేయకూడదు కొడుకు ద్వారానే అంత్యక్రియలు చేయించుకోవాలని అనుకుంటాడు అని.. ఈ విషయంలో మాత్రం నువ్వు నీ పద్ధతులను ఆరోగ్య విషయాలను మార్చుకోవాలి అని తండ్రి బాధపడుతూ చెప్పినట్లుగా సమీ వివరణ ఇచ్చాడు.

130 కేజీలు తగ్గాను
ఇక డాక్టర్ అలా చెప్పడంతో మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే సంకల్పంతో నేను నా ఆహారపు అలవాట్లను అలాగే సమయపాలన వ్యాయామం ఇలా అన్ని విషయాల్లో కూడా ఎన్నో మార్పులు చేశాను. దీంతో ఒక్కసారిగా 16 నెలల్లోనే 130 కేజీల వరకు తగ్గిపోయాను. తనను చూసిన చాలా మంది సర్జరీ చేయించుకున్నాను అని కామెంట్ చేశారు. కానీ నేను అలాంటివి ఏమీ లేకుండానే నా పద్ధతులను మార్చుకొని సక్రమంగా ఈ విధంగా మారినట్లుగా సమీ తెలియజేశారు.