twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sir movie Banjara Song Review భగవద్గీత స్పూర్తితో బంజారా పాట.. ధనుష్ మరింత డిఫరెంట్‌గా

    |

    విలక్షణ నటుడు, సూపర్ స్టార్ ధనుష్, అందాల భామ సంయుక్త మీనన్ జంటగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం సార్. తమిళంలో వాతి అనే సినిమా టైటిల్‌తో రిలీజ్ కానున్నది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో జీవి ప్రకాశ్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలోని బంజారా అనే పాటను రిలీజ్ చేశారు. పల్లెటూరు, వ్యవసాయం లాంటి ఫిలాసిఫికల్ టచ్‌తో సాగే ఈ పాట వివరాల్లోకి వెళితే..

    ఇల్లే నాదని.. వాకిలి నాదేనంటే..
    పక్కున నవ్వుతుంది భూతల్లి
    పడవే నాదని.. అలలు నావేనంటే..
    పడిపడి నవ్వుతాయి సంద్రాలే..
    పొట్టలో ఆకలిని.. నింపుతే బతుకు అని..
    తెలుసుకొని పిట్టలు వెళ్లే దారి ఎవరిది.
    మూటలు కట్టుకొని.. కావడి ఎత్తుకొని
    రెక్కలే నమ్ముకొని.. ఎల్లిపో రివ్వుమని అంటూ సాగే పాటను జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేయ రాయగా.. పాపులర్ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. గ్రామీణ నేపథ్యంతో సాగే బంజారా పాట వినగానే స్టెప్పులేయాల్సిందే అనే ఫీలింగ్‌ను కలిగిస్తున్నది.

    Dhanushs Sir/Vaathi movie second Song Banjara released with Emotional touch

    సార్ చిత్రంలో ధనుష్ లెక్చరర్ పాత్రతో ముందుకు వస్తున్నాడు. భావితరాల విద్యార్థుల భవిష్యత్ కోసం పాటుపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. వ్యక్తుల అస్థిత్వాన్ని తెలియజెప్పే కోణంలో ఈ పాట కొనసాగడం, ఆ పాటలోని సాహిత్యం అందర్నీ ఆకట్టుకొంటున్నది. సుద్దాల అశోక్ తేజ పెన్ను పవర్‌ను, కవి ఆర్ధ్రతను ఈ పాట తెలియజెప్పింది. బంజారా పాట జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా రూపొందించారు. బతుకు, జననం వాటి మధ్య మానవుడి అస్తిత్వాన్ని తెలియజెప్పే విధంగా మంచి ఫీల్‌తో పాట సాగింది.

    సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. సార్ సినిమాలో సందర్బోచితంగా వచ్చే పాట ఇది. పాట వెనుక ఉన్న సందర్బాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన విధానం నాకు మంచి స్పూర్తిని కలిగించింది. భగవద్గీతను, ఆది శంకరాచార్య బోధనలను మనసులో పెట్టుకొని రాసిన పాట బంజారా అని అన్నారు.

    Dhanushs Sir/Vaathi movie second Song Banjara released with Emotional touch

    నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, హైపర్ ఆది తదితరులు
    సమర్పణ: శ్రీకర స్టూడియోస్
    రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
    నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
    ఫైట్స్: వెంకట్
    మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
    డీవోపీ: యువరాజ్
    ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కోళ్ల
    పీఆర్వో: వేణుగోపాల్
    బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోన్ సినిమాస్

    English summary
    Actor Dhanush and Samyuktha Menon are teaming up for the much-awaited college drama, Sir a.k.a Vaathi, a Telugu-Tamil bilingual, written and directed by Venky Atluri. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the film under Sithara Entertainments and Fortune Four Cinemas while Srikara Studios presents it. GV Prakash scores the music for the drama. After delighting audiences with Mastaaru Mastaaru, the makers of Sir/Vaathi launched the second single, Banjara, today. Sung by Anurag Kulkarni and penned by national award-winning lyricist Suddala Ashok Teja, Banjara is a foot-tapping, motivational number, set in a rustic backdrop, that elaborates on the larger truths of life through simple, effective metaphors. The song establishes that the protagonist, played by Dhanush, who plays a lecturer in the film, is fighting for a cause along with a group of students. The number states the importance for all to recognise the true purpose behind their existence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X