Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Aishwaryaa Rajinikanth పై ధనుష్ ఆసక్తికరమైన కామెంట్.. విడాకుల తర్వాత తొలిసారి అలా!
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 17న తమ వీరిద్దరూ తమ విడాకుల గురించి ప్రకటించారు. 18ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ ప్రకటన రెండు నెలల క్రితం సంచలనంగా మారింది. విడాకుల అనంతరం వారు తమ తమ సినిమా పనులతో బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఐశ్వర్యను సోషల్ మీడియాలో పలకరిస్తూ కామెంట్ ఏం చేశారంటే..

18 ఏళ్ల వైవాహిక జీవితం..
ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరూ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 18ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా మా ప్రయాణాన్ని కొనసాగించాం. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండని వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

పలు భాషల్లో విడుదల..
ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ పాట తమిళ వెర్షన్‌ను సూపర్‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌లాల్ రిలీజ్ చేశారు. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పయని సాంగ్‌లో ఓ పేద ప్రేమికుడిగా కనిపించారు. ఆయనకు జోడిగా శ్రష్టి వర్మ నటించింది.

దర్శకురాలిగా బిజీ బిజీ..
తొమ్మిది సంవత్సరాల క్రితం ధనుష్ నటించిన త్రీ సినిమాతో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయం అయింది. ఆ సినిమాలో కోలవెరి డీ పాట ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వయ్ రాజా వయ్, మరియప్ప, అయిరత్తిల్ ఒరువన్ సినిమాలతో ఐశ్వర్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉండటంతో సినిమాలపై ఐశ్వర్య ఫోకస్ తగ్గించింది. ఇక, ఇప్పుడు మళ్లీ ఐశ్వర్య సినిమాల పైనే ఎక్కువ దృష్టించబోతోంది.

ఐశ్వర్య మ్యూజిక్ వీడియో..
తాజాగా ఐశ్వర్య పాయని అనే మ్యూజిక్ వీడియోకు దర్వకత్వం వహించింది. అంతేకాదు దానికి నిర్మాతగా కూడా వ్యవహరించింది. అంకిత్ తివారీ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను అనిరుధ్ ఆలపించాడు. ఈ మ్యూజిక్ వీడియోలో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నటించాడు. ఈ మ్యూజిక్ వీడియో తాజాగా విడుదలైంది. రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. సంగీత ప్రియులందరూ ఈ పాటపై ప్రశంసలు కురిపించారు. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభను కొనియాడారు.

మాజీ భార్యకు ధనుష్ విషెస్..
ఈ మ్యూజిక్ వీడియోకు ధనుష్ కూడా ఫిదా అయ్యాడు. సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్యకు అభినందనలు తెలిపాడు. నీ మ్యూజిక్ వీడియోకి కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ట్విటర్‌లో ధనుష్ ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. కాగా, ధనుష్ మెసేజ్‌కు ఐశ్వర్య కూడా స్పందించింది. ధన్యవాదాలు ధనుష్.. గాడ్‌స్పీడ్ అని రిప్లై ఇచ్చింది. దంపతులుగా విడిపోయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.