twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhoom Dhaam Dhosthaan Review.. పవ్వ గొట్టు.. బోటికూర అంచుకువెట్టు.. బాంచోత్ అంటూ నానికి దసరా పూనకం

    |

    నేచురల్ స్టార్ నానీ నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మూవీకి సంబంధించిన మాస్, లోకల్ స్ట్రీట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఊరమాస్‌ అంటే తక్కువే అనే విధంగా నాని వేసిన స్టెప్పులు.. మ్యూజిక్ కిర్రాక్ లేపింది. ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ సాగే పాటలో తెలంగాణ మట్టి వాసన గుభాలించింది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    పూనకం వచ్చిన భక్తుడిలా

    పూనకం వచ్చిన భక్తుడిలా

    పక్కా మాస్, ఊర మాస్ అనే పదాలకు మించిన జానపద గేయంలో నానీ ఎనర్జీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూనకం వచ్చిన భక్తుడిలా పాటలో చిందులేశాడు. మద్యం జోరు, మేళతాళాల హోరు పాటకు ప్రాణంగా నిలిచింది. ఇప్పటి వరకు ఇంతటి మాస్ సాంగ్‌ను తెరమీద చూశామా అనే అనుమానం కలిగే విధంగా పాటను తెరకెక్కించారు.

    ఊర మాస్ గెటప్‌లో

    ఊర మాస్ గెటప్‌లో


    ఇప్పటి వరకు పాలిష్ కోటెడ్ పాత్రల్లో నానిని ప్రేక్షకులను మెప్పించాడు. కానీ దసరా సినిమాలో ఎవరూ ఊహించని గెటప్‌లో పల్లెటూరులో ముతక యువకుడి పాత్రలో మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అనే ఫీలింగ్‌ను ధూమ్ ధామ్ పాటలో కల్పించాడు. సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన సంగీతానికి రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోరా దాసలక్ష్మీ పాటను ఆలపించారు. ఈ పాటకు కసార్ల శ్యామ్ పక్కా తెలంగాణ భావాలు ఉట్టిపడేలా సాహిత్యాన్ని అందించాడు.

    బద్దలు బాసింగాలు అంటూ..

    బద్దలు బాసింగాలు అంటూ..


    ఉంటే వైకుంఠం.. లేకుంటే ఊకుంటం.. అంత లావైతే.. గుంజుకుంటం.. తింటం.. అయితయ్.. అయితయ్ బద్దలు బాసింగాలు అయితయ్.. అంటూ సాగే ధూమ్ ధామ్ దోస్తానా పాటలో 90 ఎంఎల్ మందు కొట్టి.. జోష్‌తో డప్పులు కొడుతూ పాటలో నానీ వీరంగం సృష్టించారు. పవ్వగొట్టు..బోటీ కూర..దానంచుకువెట్టు.. బ్యాండు కొట్టు.. బ్యాండు కొట్టు.. వాడకట్టు.. లేసూగేటట్టు.. గుద్దుతే సూస్కో.. ఓ అద్ద సేరు.. గజ్జల గుర్రం.. ఈ సిల్క్ బారు.. ఇచ్చిపడేద్దాం.. కుచ్చిపడేద్దాం.. ఎవడడ్డమొద్దామో చూద్దాం.. బాంచోత్ అంటూ మాస్ జనాలకు కిక్కించేలా కాసర్ల శ్యామ్ తన కలానికి పదునుపెట్టాడు.

    శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో

    శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో

    దసరా సినిమాకు నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నానికి జంటగా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహెబ్ తదితరులు నటిస్తున్నారు.

    మార్చి 30 దసరా పండుగ..


    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కోళ్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మార్చి 30, 2023 తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది.

    English summary
    Natural Star Nani’s highly anticipated Pan India film Dasara have created huge hype on the first single of the movie with a promotional video. The makers unveiled the song Dhoom Dhaam Dhosthaan, just a while ago. Nani’s character look is just unbelievable for the kind of makeover he underwent. Santhosh Narayan composed the song, while Rahul Sipligunj, Palamuru Jangireddy, Narsamma, Gotte Kanakavva and Gannora Dasa Laxmi crooned it remarkably. Kasarla Shyam has penned the song in typical Telangana style.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X