For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'లాలా భీమ్లా' డీజే మిక్స్ వచ్చేసింది.. మళ్ళీ అదరకొట్టిన థమన్.. పూనకాలు తెప్పించేశాడుగా!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా యూనిట్‌ నూతన సంవత్సరాది సందర్భంగా లాలా భీమ్లా నాయక్ డీజే వెర్షన్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  Recommended Video

  Bheemla Nayak New Release Date Announced | Pawan Kalyan| Rana Daggubati
   లాలా భీమ్లా

  లాలా భీమ్లా

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ స్వయంగా రాశారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. 'లాలా భీమ్లా' సాంగ్ కి ప్రేక్షకులు పట్టం కట్టేశారు. థమన్ మాస్ మ్యూజిక్ తో అదరగొట్టడంతో ఆ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వింటున్నారు.

   రిపీట్ మోడ్ లో

  రిపీట్ మోడ్ లో

  ఈ సాంగ్ రిలీజైన అప్పటి నుంచి ఎక్కడ విన్నా ఇదే సాంగ్ ప్లే రిపీట్ మోడ్ లో ప్లే అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచడానికి గాను ఈ లాలా భీమ్లా సాంగ్ డీజే వెర్షన్ ని రిలీజ్ చేశారు.

  లాలా భీమ్లా డీజేతో

  లాలా భీమ్లా డీజేతో

  ఈ కొత్త సంవత్సర వేడుకల్లో లాలా భీమ్లా డీజేతో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందే అంటూ మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. నార్మల్ గానే బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ అందించే థమన్.. డీజే వెర్షన్ ని మరింత ఊపు వచ్చే విధంగా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఒకరకంగా ఎక్కడ విన్నా లాలా భీమ్లా డీజే మారుమ్రోగుతోంది. థమన్ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇస్తున్నాడు. పవన్ తో పని చేసే అదృష్టం రావడంతో ఆయన ఆనందాన్ని ఎవరూ ఆపలేకున్నారు.

  మంచి స్పందన

  మంచి స్పందన

  భీమ్లా నాయక్ సినిమాలో పవన్ క్యారెక్టర్ అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. "పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు... పిడుగులు వచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు..." అంటూ త్రివిక్రమ్ రాసిన ఈ సాంగ్ కు మంచి స్పందన లభించింది.

   ఆ సినిమా రీమేక్ గా

  ఆ సినిమా రీమేక్ గా

  మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వెనక్కి వెళ్ళింది.

  కీలక పాత్రలలో

  కీలక పాత్రలలో

  రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. 'భీమ్లా నాయక్' నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి, కీలక పాత్రలలో నటిస్తున్నారు.

  English summary
  DJ Version Of LaLa Bheemla from bheemla nayak movie released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X