twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD MM.Keeravani: రాజమౌళి ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడిన స్వరకర్త, RRR రెమ్యునరేషన్ ఎంతంటే?

    |

    ఎమ్ఎమ్.కీరవాణి అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతం తెలిసిన అతికొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఆయన ఒకరు. సంగీతానికి తెలుగు పదాలకు సరైన న్యాయం చేస్తున్న ఆయన ఈ రోజు పాన్ ఇండియా స్థాయికి వచ్చారు. ఒకనొక సమయంలో రాజమౌళితో పాటు ఉమ్మడి కుటుంబంగా ఉన్న 5మంది అన్నదమ్ముల ఫ్యామిలీలను ఆయన సంగీతంతోనే పోషించారు. ఇక నేడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలపై అలాగే RRR రెమ్యునరేషన్ పై ఒక లుక్కేద్దాం..

    ఆర్థిక నష్టాల్లో ఫ్యామిలీ..

    ఆర్థిక నష్టాల్లో ఫ్యామిలీ..

    కీరవాణి, దర్శకుడు రాజమౌళి అన్నదమ్ముల పిల్లలని అందరికి తెలిసిన విషయమే. దాదాపు కుటుంబ సభ్యులందరు సినిమా ఇండస్ట్రీలో ఎదో ఒక విధంగా మంచి గుర్తింపు అందుకున్నవారే. పుట్టుకతోనే శ్రీమంతులు అయినప్పటికీ ఒక సినిమా నిర్మించడం వలన వారి కుటుంబం మొత్తం కూడా నష్టపోవాల్సి వచ్చింది.

    ఫ్యామిలీ మొత్తాన్ని ఒంటి చేత్తో మోశాడు

    ఫ్యామిలీ మొత్తాన్ని ఒంటి చేత్తో మోశాడు

    దాదాపు 20 మందికి పైగా ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని పోషించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎవరికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో కీరవాణి సంగీత దర్శకుడిగా మారి ఫ్యామిలీ మొత్తాన్ని ఒంటి చేత్తో మోశాడు. ఇష్టం లేకపోయినా కూడా కొన్ని సినిమాలను డబ్బు కోసం తప్పక చేయాల్సి వచ్చింది.

    సినిమాల్లో కుటుంబం మొత్తం

    సినిమాల్లో కుటుంబం మొత్తం

    కీరవాణి తండ్రి , రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కొన్ని సినిమాలకు రచయితలుగా కూడా వర్క్ చేశారు. అయినప్పటికీ ఎక్కువ భాగం కీరవాణి బాధ్యతను తీసుకుంటూ వస్తున్నాడు. ఇక మెల్లగా రాజమౌళి కూడా దర్శకుడిగా మారిన అనంతరం వారి కుటుంబం ఒక ట్రాక్ లోకి వచ్చింది. నటుడు కాంచి, మ్యూజిక్ డైరెక్టర్స్ శ్రీలేఖ, కళ్యాణి మాలిక్ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు.

    ఎన్నో మ్యూజికల్ హిట్స్

    ఎన్నో మ్యూజికల్ హిట్స్

    ఇక కీరవాణి సంగీత ప్రయాణం 1990లో మొదలైంది. మొదటి రెండు సినిమాలు అంతగా ఆడలేదు. ఇక సీతారామయ్య గారి మనవరాలు సినిమాతోనే ఆయనకు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కింది. అనంతరం ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, మాతృదేవో భవ, అన్నమయ్య, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, శ్రీరామదాసు వంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు.

    రాజమౌళి సినిమాలకు..

    రాజమౌళి సినిమాలకు..

    కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఆయన మ్యూజిక్ అందించారు. ఇక దాదాపు రాజమౌళి సినిమాలన్నటికి ఆయనే సంగీత దర్శకుడిని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక బాహుబలితో ఆయన స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. అన్ని భాషల్లో పట్టు ఉండడంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు తనదైన శైలిలో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

    Recommended Video

    Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
    RRR రెమ్యునరేషన్ ఎంతంటే?

    RRR రెమ్యునరేషన్ ఎంతంటే?

    ఇక నెక్స్ట్ రాబోతున్న RRR సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు హీరోల అనంతరం అత్యధికంగా కీరవాణి 16కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఆయన ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిష్ పవన్ కళ్యాణ్. కాంబినేషన్ లో రాబోతున్న హరహర వీరమల్లు సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Koduri Marakathamani Keeravaani, better known as M. M. Keeravani, is an Indian film composer, playback singer and lyricist, who works predominantly in Telugu cinema along with other languages including Tamil, Kannada, Malayalam and Hindi. MM keeravani RRR remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X