Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Akira Nandan: గుండెను తాకేలా పవన్ కళ్యాణ్ తనయుడి మ్యూజిక్.. యువ హీరో ఫిదా
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ అందరికంటే ఎక్కువ హైటు అనుకుంటున్న తరుణంలో అకిరా అతని కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. కాస్త ట్రై చేసినా కూడా తను అగ్రహీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు అని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు ఆ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.
Thank you dear #Akira for sending me this. Heart is full. Love you ❤️ @SricharanPakala Check out Akira’s beautiful cover rendition of #Hrudayama / #Saathiya #MajorTheFilm 🇮🇳 pic.twitter.com/UouvZFpTmi
— Adivi Sesh (@AdiviSesh) June 16, 2022
అంతేకాకుండా అకీరానందన్ సైతం యాక్టింగ్ అనేది ఆసక్తి లేనట్లుగానే కనిపించాడు. కాకపోతే అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. ఇటీవల తన స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రత్యేకంగా దోస్తీ పాటను ప్లే చేసిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వేడుకలో అదే హైలెట్ గా నిలిచింది. అయితే రీసెంట్ గా మేజర్ సినిమా లోని హృదయం అనే ఒక మెలోడీ సాంగ్ కూడా చాలా చక్కగా పియానో లో ప్లే చేయడం వైరల్ గా మారింది.

సాధారణంగా అకిరా నందన్ కు సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు అడివి శేష్ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడంతో అది కూడా వైరల్ గా మారిపోయింది. 'ఇది సెండ్ చేసినందుకు చాలా థాంక్యూ అకిరా.. గుండె నిండిపోయింది.. లవ్ యూ.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ఒకసారి ఇది చెక్ చేయండి..:అని అడివి శేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇక అడివి శేష్ తో అకిరాకు ఒక ప్రత్యేకమైన సోదర భావం ఉంది. పంజా షూటింగ్ టైమ్ లో మొదలైన పరిచయం అతనితో అలానే కొనసాగుతూ వస్తోంది. అప్పుడప్పుడు వీరికి సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల అకిరా నందన్ కూడా మేజర్ ప్రీమియర్ షోను కూడా టాప్ సెలబ్రెటీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించాడు.