twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిషన్ కోసం గాయకుడిగా మారిన సిద్ధార్థ్.. 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటూ

    |

    'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకొన్న సిద్ధార్థ్ మరోసారి గాయకుడి అవతారం ఎత్తారు. గతంలో 'బొమ్మరిల్లు' చిత్రంలో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...', 'ఓయ్' సినిమాలో '176 బీచ్ హౌస్ లో ప్రేమదేవత', 'ఆట' సినిమాలో 'నిన్ను చూస్తుంటే' పాటలను సిద్ధార్థ్ పాడిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ హీరో సందీప్ కిషన్ కోసం మరో తెలుగు పాట పాడారు. ఆ పాట గురించి మరిన్ని వివరాలు..

     నిను వీడని నీడను నేనే చిత్రంలో

    నిను వీడని నీడను నేనే చిత్రంలో

    సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...'ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.

    తెలుగును నేనెప్పుడూ మరిచిపోలేను

    తెలుగును నేనెప్పుడూ మరిచిపోలేను

    తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది. న‌టుడిగా నాకు గుర్తింపు, గౌర‌వం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమాయే. తెలుగు ప‌రిశ్ర‌మ‌ అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా... నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను అని సిద్ధార్థ అన్నారు.

    సిద్ధార్థ్ అంటే ఇష్టం

    సిద్ధార్థ్ అంటే ఇష్టం

    సందీప్ కిషన్ మాట్లాడుతూ నాకు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నా తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలో తను ఏదో రకంగా అసోసియేట్ అయితే బావుంటుందని అనిపించింది. అలాగే, సిద్ధార్థ్ వాయిస్‌కి, తను పాడిన పాటలకు నేను పెద్ద అభిమానిని. 'అప్పుడో ఇప్పుడో..' పాటకు, '176 బీచ్ హౌస్ లో పాటకు నేను పెద్ద అభిమానిని. నిర్మాతగా నా మొదటి సినిమాలో సిద్ధార్థ్ గొంతులో నా పాట రావడం అనేది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్. నటుడిగా నాకు మొదటి నుంచి ఎవరెవరు అయితే అండగా నిలిచారో.. వారందరూ ఏదో రకంగా చిన్న భాగంగా అయినా ఉండాలని కోరుకున్నాను. అది ఇలా అయినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.

    సందీప్, సిద్ధార్థ్ అలా చేయడం సంతోషంగా

    సందీప్, సిద్ధార్థ్ అలా చేయడం సంతోషంగా

    సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ "సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా 'లవ్ ఫెయిల్యూర్'కి... సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నేను సంగీత దర్శకుడు కావడం యాదృచ్చికమే. నాకు ఇది సంతోషంగా ఉంది. ఇద్దరూ నాకు మంచి స్నేహితులు" అన్నారు.

     సిద్ధార్థ్ పాడితే ఎలా

    సిద్ధార్థ్ పాడితే ఎలా

    పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ "ఈ లిరిక్స్ రాసేటప్పుడు ఈ పాట సిద్ధార్థ్ గారు పాడితే ఎలా ఉంటుంది?' అని ఆలోచిస్తూ, ఆయన్ను మనసులో పెట్టుకుని రాశాడు. ఏయే తెలుగు పదాలు ఆయన వాయిస్‌లో బావుంటాయని ఆలోచించి రాశా. ఇప్పటివరకూ సిద్ధార్థ్ పాడిన ప్రతి తెలుగు పాట బ్లాక్ బస్టర్. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు - ఫణి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.

    English summary
    Mention Siddharth's name and the Telugu audience are sure to remember 'Bommarillu', 'Nuvvostananate Nenoddantana', 'Aata', 'Konchem Ishtam Konchem Kashtam' and other films. And he has entertained the audience not just as an actor but also as a singer. 'Appudo Ippudo' from 'Bommarillu', '176 Beach House Lo Prema Devatha' from 'Oye', 'Ninnu Choostunte' from 'Aata' are popular. And, now, Siddharth has rendered a Telugu song after many years. This time, it's for Sundeep Kishan. It's for a song in the film 'Ninu Veedani Needanu Nenu'. Sundeep Kishan is producing this novel movie on Venkatadri Talkies (Production No. 1) in association with Vista Dream Merchants. Directed by Caarthick Raaju, the actor is paired up with Anya Singh in this entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X