For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12 winner పవన్ దీప్ రాజన్.. తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు ఎన్నో స్థానమంటే!

  |

  భారతీయ టెలివిజన్ రంగంలో పాపులర్ షో ఇండియన్ ఐడల్ 12 ఫినాలే గ్రాండ్‌గా ముగిసింది. 12 గంటలపాటు మారథాన్‌గా సాగిన ఈ షోలో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ విజేతగా నిలిచారు. అందరూ ఊహించిన విధంగానే పవన్ దీప్ రాజన్ ఈ సీజన్ టైటిల్‌ను ఎగురేసుకుపోయారు. స్టార్ సింగర్లు, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ప్రముఖుల తళుకుల మధ్య ఈ షో ఆద్యంతం సందడిగా సాగింది. అయితే షణ్ముఖప్రియ ఆరోస్థానంలో నిలవడం ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నది. ఫినాలే గురించి పూర్తి వివరాల్లోకి వెళితే...

  అర్ధరాత్రి 12 గంటల వరకు

  అర్ధరాత్రి 12 గంటల వరకు

  ఆదివారం అర్ధరాత్రి 12 గంటలవరకు సాగిన ఈ సుదీర్ఘ ఫైనల్‌లో కంటెస్టెంట్లు ఒకరికంటే మరొకరు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నించారు. అలాగే ఓటర్లను ఆకట్టుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే చివరకు పవన్ దీప్ రాజన్‌కు ఓటర్లు ఇండియన్ ఐడల్ 12 టైటిల్‌ను పట్టం కట్టారు. దీంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది.

  ట్రోఫి, 25 లక్షల చెక్; మారుతి కారుతో

  ట్రోఫి, 25 లక్షల చెక్; మారుతి కారుతో

  పవన్ దీప్ రాజన్‌కు టైటిల్‌తో భారీ బహుమానం లభించింది. ఈ సీజన్‌లో విజేతకు ప్రకటించిన 25 లక్షల రూపాయల చెక్‌ను సోని లివ్ నిర్వాహకులు చెక్ అందజేశారు. అలాగే మారుతీ కంపెనీ నుంచి పవన్ దీప్‌కు బ్రాండ్ న్యూ స్విఫ్ట్ కారును బహుకరించారు. అభిమానుల జేజేల మధ్య పవన్ దీప్ టైటిల్ ట్రోఫిని, చెక్‌ను, మారుతి కారు తాళాలను అందుకొన్నారు. పవన్ దీప్ విజేతగా భావోద్వేగానికి గురయ్యారు.

  రెండో స్థానంలో అరుణిత కంజిలాల్

  రెండో స్థానంలో అరుణిత కంజిలాల్


  ఇక ఇండియన్ ఐడల్ 12 షోలో రెండో స్థానంలో అరుణిత కంజిలాల్, సయాలీ కాంబ్లే మూడోస్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో మహ్మద్ డానిష్, నిహాల్ టారో ఐదోస్థానంలో నిలువగా, షణ్ముఖప్రియ ఆరోస్థానంలో నిలిచారు. అరుణిత కంజిలాల్, పవన్ దీప్ రాజన్ ఇద్దరు ఈ షో కొనసాగుతుండగానే ప్రేమలో పడ్డారు. వారి జంట ప్రస్తుతం మ్యూజిక్ ప్రపంచంలో క్రేజీగా మారింది. అభిమానులు ఆశించినట్టుగానే వారిద్దరూ టాప్ స్థానాల్లో ఉండటం విశేషంగా మారింది. అరుణిత, సయాలీ కాంబ్లీకి చెరో 5 లక్షల రూపాయల పారితోషికం లభించింది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన డానిష్; నిహాల్ టారోకు చెరో మూడు లక్షల రూపాయల పారితోషికం లభించింది.

  విజయ్ దేవరకొండ స్పెషల్ ఎంట్రీ

  విజయ్ దేవరకొండ స్పెషల్ ఎంట్రీ


  ఇండియన్ ఐడల్ 12 ఫినాలేలో ఆరుగురు కంటెస్టెంట్లతోపాటు ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్, సుఖ్విందర్ సింగ్, కుమార్ సాను తదితరులు వేదికపై పాటలు పాడి ఉర్పూతలూగించారు. విజయ్ దేవరకొండ ఫినాలే జరుగుతుండగా షణ్ముఖప్రియకు విషెస్ తెలియజేయడమే కాకుండా తన సినిమాలో పాటను పాడే అవకాశం కూడా ఇవ్వడం విశేషంగా మారింది. విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనిపించడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించింది.

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  షణ్ముఖప్రియకు ఆరోస్థానంతో

  షణ్ముఖప్రియకు ఆరోస్థానంతో

  అయితే కనీసం రెండో, మూడో స్థానంలోనైనా షణ్ముఖప్రియ నిలుస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. షణ్ముఖప్రియకు ఆరో స్థానం లభించగానే ఆమె తల్లిదండ్రులు నిరాశకు గురైనట్టు కనిపించారు. దక్షిణాదిలో ప్రేక్షకులు, సంగీత అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. షణ్ముఖప్రియకు అన్యాయం జరిగిందనే మాట అభిమానుల్లో వినిపిస్తున్నది.

  English summary
  Popular Show Indian Idol 12 winner is Uttarakhand's Pawandeep Rajan. The talented singer won the 12-hour grand finale of the show on Sunday with Arunita Kanjilal and Sayli Kamble as runners-up.Shanmukhapriay stood at 6th place.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X