పెళ్లి సందడి రొమాంటిక్ మాస్ సాంగ్..మొదటిసారి కీరవాణి - మంగ్లీ కాంబో..
నేటితరం మ్యూజిక్ దర్శకులతో సమానంగా పోటీ పడుతూ ఎంతగానో ఆకట్టుకున్న కీరవాణి మరో సాంగ్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. సినిమా ఎలా ఉన్నా కూడా సంగీతానికి తగ్గట్లుగా మోడ్రన్ మెలోడీ సాంగ్స్ ను కూడా అందించ గలిగే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్నారు. ఇక కీరవాణితో ఎంతో కాలంగా మ్యూజిక్ చేయించుకుంటున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మరోసారి అద్భుతమైన ఆల్బమ్ ను రెడీ చేయిస్తున్నారు.
కె.రాఘవేంద్రరావు చాలా కాలం తరువాత పెళ్లి సందD అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ ను హీరోగా రీ లాంచ్ చేస్తూన్న ఈ సినిమా సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకే ప్రేమంటే ఏంటి.. అనే మెలోడీ సాంగ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు బజ్జులు బజ్జులు అనే రొమాంటిక్ మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఇక ఎమ్ఎమ్. కీరవాణి మొదటిసారి సింగర్ మంగ్లీ చేత పాట పాడించారు. ప్రస్తుతం ఆమె పాటలకు మంచి క్రేజ్ అందుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన బాబా సెహగల్ కూడా ఈ పాటలో తన గాత్రాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ విభిన్నమైన కాంబినేషన్ లో వచ్చిన పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రోషన్ డ్యాన్స్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇక హీరోయిన్ శ్రీలీలాను కూడా దర్శకేంద్రుడి మార్క్ కు తగ్గట్లుగానే ప్రజెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











