twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2019: తొలి అకాడెమీ అవార్డ్ గెలిచిన లేడీ గాగా, భావోద్వేగం..

    |

    హాలీవుడ్ సింగర్, నటి లేడీ గాగా కెరీర్లో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో 'ఎ స్టార్ ఈజ్ బార్న్' అనే సినిమాలోని ''షాలో'' అనే పాటకుగాను ఆమె అకాడెమీ అవార్డును దక్కించుకుని తన కల నెరవేర్చుకున్నారు.

    లేడీ గాగాతో పాటు సహ రచయితలు మార్క్ రాన్సన్, ఆండ్య్రూ వైట్, ఆంటోనీ రోసోమండోకు ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా లేడీ గాగా మాట్లాడుతూ.. 'తమపై నమ్మకం ఉంచిన దర్శకుడు, కో-స్టార్ బ్రాడ్లీ కూపర్‌కు' థాంక్స్ చెప్పారు. కెరీర్లో తొలి ఆస్కార్ అవార్డు కావడంతో లేడీ గాగా భావోద్వేగానికి లోనయ్యారు.

    Lady Gaga wins her first Oscar Award

    'నీకు ఏదైన డ్రీమ్ ఉంటే దాని కోసం ఫైట్ చేయాలి. పాషన్‌తో పాటు డిసిప్లిన్ ఉండాలి. నువ్వు ఎన్నిసార్లు తిరస్కరించబడ్డావు, ఎన్నిసార్లు డౌన్ అయ్యావు అనేది ముఖ్యం కాదు.. ఎన్ని సార్లు తిరిగి నువ్వు నిలబడ్డావు, ఎన్ని సార్లు మళ్లీ ధైర్యంగా ముందుకు వెళ్లావు అనేదే ముఖ్యం' అని లేడీ గాగా వ్యాఖ్యానించారు.

    మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన 'ఎ స్టార్ ఈజ్ బార్న్' చిత్రానికి బ్రాడ్లీ కూపర్ దర్శకత్వం వహించారు. బ్రాడ్లీ కూపర్, లేడీ గాగా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ గతేడాది ఆగస్ట్ 31న విడుదలై యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది.

    English summary
    Singer-actress Lady Gaga took home her first Oscar in the Best Original Song category for "Shallow" the popular track from the hit film, "A Star Is Born".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X