Lata mangeshkar No More: 50 వేలకు పైగా పాటలు.. తెలుగులో మాత్రం ఆ ముగ్గురి సినిమాల్లోనే!

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సినీ వినీలాకాశంలో మరో ధృవతార కనుమరుగైపోయింది. సుదీర్ఘ కాలంగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ గాయని గాన కోకిల లతా మంగేష్కర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె పాడిన పాటల గురించి తెలుసుకుందాం పదండి!

 కరోనాతో ఆస్పత్రిలో చేరిన సింగర్

కరోనాతో ఆస్పత్రిలో చేరిన సింగర్

ఎన్నో ఏళ్లుగా తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తోన్న లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) కొద్ది రోజుల క్రితమే కరోనా వైరస్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ ​క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు వారాలుగా ఆమె చికిత్స తీసుకుంటూ వచ్చారు.

 కోలుకున్న కొన్ని రోజులకే మృతి

కోలుకున్న కొన్ని రోజులకే మృతి

నాలుగు వారాల పాటు కరోనాకు చికిత్స తీసుకున్న తర్వాత లతా మంగేష్కర్ ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన కూడా చేశాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇటీవలే లత ఆరోగ్యం మరోసారి క్షిణించింది. దీంతో ఈ దిగ్గజ గాయని ఈరోజు ఉదయం తుదిశ్వాసను విడిచారు.

18 భాషల్లో 50 వేలకు పైగా పాటలు

18 భాషల్లో 50 వేలకు పైగా పాటలు

చిన్న వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్.. అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. ఇలా సుదీర్ఘమైన ప్రయాణంలో దాదాపు 20 భాషల్లో సుమారు యాభై వేలకు పైగా పాటలను ఆలపించారు. అందులో ఎక్కువగా హిందీ, మరాఠీ భాషల్లోనే స్వరాన్ని అందించి శ్రోతలను మైమరపించారు.

తెలుగులో మాత్రం మూడు పాటలే

తెలుగులో మాత్రం మూడు పాటలే

దాదాపు 60 ఏళ్ల సినీ ప్రయాణంలో లతా మంగేష్కర్ యాభై వేలకు పైగా పాటలను ఆలపించారని ముందే చెప్పుకున్నాం. ఇండియన్ భాషలతో పాటు నేపాలీ, ఇంగ్లీష్ సహా మరికొన్ని లాంగ్వేజ్‌లలోనూ ఆమె గాత్రాన్ని అందించారు. అయితే, ఆమె తెలుగులో మాత్రం కేవలం మూడు పాటలనే పాడడం గమనార్హం. దీంతో లతా మంగేష్కర్ సేవలను మనవాళ్లు దక్కించుకోలేదు.

తెలుగులో మొదటి పాట ఆయనకే

తెలుగులో మొదటి పాట ఆయనకే

తన సినీ ప్రయాణంలో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ తొలిసారి 1955లో తెలుగులో పాటను ఆలపించారు. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి జంటగా నటించిన 'సంతానం' సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే ఓ గీతాన్ని ఆమె పాడారు. ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. ఇది అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌ తర్వాత నాగార్జున మూవీ

ఎన్టీఆర్‌ తర్వాత నాగార్జున మూవీ

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తెలుగు పాడిన రెండో పాటు నందమూరి తారక రామారావుకే. 1965లో ఎన్టీఆర్, జమున జంటగా నటించిన 'దొరికితే దొంగలు' సినిమాలో శ్రీ వెంకటేశ్వర అనే పాటను పాడారు. అనంతరం గ్యాప్ తీసుకున్న ఆమె 1988 వచ్చిన నాగార్జున చిత్రం 'ఆఖరి పోరాటం'లో తెల్ల చీరకు అంటూ సాగే డ్యూయట్‌ను ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి పాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X