Don't Miss!
- News
మహానాడు పెట్టింది అందుకేనా? చంద్రబాబు టీడీపీకి పట్టిన శని: మంత్రి రోజా హాట్ కామెంట్స్
- Automobiles
మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
- Sports
ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్గా మారిన దినేష్ కార్తీక్.. ఎంత పెద్ద తప్పు చేశాడంటే?
- Finance
Petrol prices today: ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు తర్వాత కూడా స్థిరంగా పెట్రోల్ ధరలు
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Lata Mangeshkar దిగ్గజ గాయనికి ఐసీయూలోనే చికిత్స.. పుకార్లు నమ్మకండి.. సన్నిహితుల విన్నపం
నైటింగల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడి, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆమెకు ఇంకా ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నాం అని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్య వర్గాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్ 19 పాజిటివ్, అలాగే న్యుమేనియా లక్షణాలతో లతా మంగేష్కర్ హాస్పిటల్‌లో చేరడం తెలిసిందే. ఇంకా ఆమెకు ఐసీయూలోనే చికిత్స జరగడం గమనార్హం. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులకు, సంగీత ప్రియులు ప్రార్థనలు చేయాలని సన్నిహితులు సూచించారు. లతా మంగేష్కర్ గురించి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వర్గాలు తెలిపిన విషయాలు ఏమిటంటే..
లతా మంగేష్కర్‌ను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. వారం రోజులకుపైగానే హాస్పిటల్‌లోనే ఉన్నారు అని డాక్టర్ ప్రతీత్ సమ్దానీ తెలిపారు. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో.. లతా జీ ఐసీయూలోనే ఉన్నారు. ఆమె త్వరగా కోలుకొనేలా చేయడానికి మా ప్రయత్నాలు చేస్తున్నాం. అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ప్రార్థనలతో ఆమె మరింత త్వరగా కోలుకొంటారు అని బులెటిన్‌లో తెలిపారు.

లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు సూచనలిస్తే.. ఇంటికి తిరిగి రావడానికి సిద్దంగా ఉన్నాం. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ తప్పుడు వార్తలే అని లతా మంగేష్కర్ అధికారప్రతినిధి అనుషా శ్రీనివాసన్ అయ్యర్ తెలిపారు. తప్పుడు వార్తలతో అభిమానులు కలత చెందతున్నారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి అని కోరారు.
లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వస్తే.. 1942 సంవత్సరంలో తన 13వ ఏట తొలి పాటను పాడారు. అప్పటి నుంచి సుమారు 30 వేల పాటలకుపైగా ఆలపించారు. సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను.. ఆమెకు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొన్నారు. మూడుసార్లు ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు స్వీకరించారు. ఇంకా పలు అవార్డులతో సత్కరించారు.