జాను అప్‌డేట్ : లైఫ్ ఆఫ్ రామ్.. వీడియో సాంగ్ విడుదల

సమంత, శర్వానంద్ జంటగా నటించిన చిత్రం జాను. తమిళ నాట సంచలనం సృష్టించిన 96 సినిమాను తెలుగులో జానుగా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో సందడి చేయగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

జాను చిత్రంలో శర్వానంద్.. రామచంద్ర అనే పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలో భాగంగా శర్వానంద్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్‌గా పని చేస్తాడు. జాను చిత్రం విడుదలకు దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను పెంచేసింది యూనిట్. ఈ క్రమంలో ది లైఫ్ ఆఫ్ రామ్ పేరిట ఓ వీడియో పాటను రిలీజ్ చేశారు.

Life Of Ram Video Song From Jaanu

రాజస్థాన్ ఎడారి ప్రాంతాలతో పాటు, అడువులు, సముద్రాలు ఇలా ప్రకృతిని చుట్టేస్తూ.. కెమెరాలో బంధిస్తున్నాడు. ఈ పాటలో విజువల్స్ అదిరిపోయాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను ప్రదీప్ కుమార్ ఆలపించాడు. గోవింద్ వసంత్ సంగీతమందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X