‘లవ్ స్టోరీ’ నుంచి ‘సారంగ దరియా’ టీజర్ రిలీజ్: ఆకట్టుకుంటోన్న తెలంగాణ ఫోక్ సాంగ్
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలోని 'సారంగ దరియా' అనే తెలంగాణ పల్లె పదాల పాట ఫిబ్రవరి 28న స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ పాట టీజర్ రిలీజ్ అయింది.
గతంలో తెలంగాణలో సింగర్ పాడిన 'దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' ఫోక్ సాంగ్‌ను 'లవ్ స్టోరీ'లో రిమిక్స్ చేశారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. ఇందులో పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే కొన్ని విజువల్స్‌ను చూపించారు. అంతేకాదు, సాయి పల్లవి మార్క్ స్టెప్పులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ప్రేక్షకులు కోరుకునే పాట ఇదే అని అనిపిస్తోంది.

'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో 'లవ్ స్టోరీ' మూవీ బిజినెస్‌ను భారీ స్థాయిలో జరుగుతుందట. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. వీటన్నింటికీ కలిపి రూ. 16 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇది చైతూ కెరీర్‌లోనే బెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











