Just In
- 2 min ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 37 min ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
- 1 hr ago
రెమ్యూనరేషన్లో మహేష్ బాబుకు ‘సరిలేరు’.. మొత్తంగా ఎంత తీసుకున్నాడంటే?
- 1 hr ago
తెరపైకి కొత్త చర్చ: అంతా ఓకే కానీ.. ఆ విషయంలో మాత్రం బన్నీ ఫ్యాన్స్‌లో నిరాశ.!
Don't Miss!
- News
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత....!
- Finance
ఎంత పని చేసింది ఉల్లి .. ఏమవుతోందో తెలుసా?
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మాస్ లుక్.. నువ్వు స్టెప్పేస్తే.. మైండ్ బ్లాక్.. సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ సింగిల్ కేక
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ సమీపిస్తున్న కొద్ది భారీ అంచనాలు పెంచుతున్నది. ఇప్పటికే టీజర్లు, లుక్స్‌తో అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ రూపొందించిన ఈ సాంగ్ మాస్ ఎలిమింట్స్‌తో కేక పెట్టిస్తున్నది. ఈ పాట గురించి వివరాల్లోకి వెళితే.

సినీ రచయిత శ్రీమణి రాసిన పాట..
ఎప్పుడు ప్యాంట్ వేసే వాడు.. ఇప్పుడు లుంగీ కట్టాడు
ఎప్పుడు షర్ట్ వేసేవాడు.. ఇప్పుడు జుబ్బా తొడిగేశాడు
చేతికేమో మల్లెపూలు.. కళ్లకేమో కళ్లజోడు
చుట్టేసి.. పెట్టేసి .. వచ్చేశాడు..
బాబు నువ్వు సెప్పు.. వాడిని కొట్టమని డప్పు సాగుతూ..
నువ్వుకొట్టారా అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకొన్నది.

మాస్ బీట్‌తో సాగే ‘మూన్ వాక్.. మూన్ వాక్.. నీ నడక చూస్తే మూన్ వాక్..
ఎర్త్ క్వేక్.. ఎర్త్ క్వేక్.. పిల్లా నీవు తాకుతుంటే ఎర్త్ క్వేక్
నీ లిప్పులోన ఉంది కప్పు కేకు..
మాటలోన ఉంది మిల్క్ షేక్..
సోకులోన ఉంది కొంత స్టాక్
నీవు హాట్ హాట్‌గా ఉన్న పూతరేకు
ముట్టుకొంటే జారిపోయే తామరాకు
మనసు ఎర్రచేసే తమలపాకు' అంటూ దేవీ శ్రీ పాడిన చరణాలు మాస్ ఎలిమెంట్స్‌తో కేక పెట్టించేలా ఉన్నాయి.

మహేష్ డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా
పాట మధ్య మహేష్ చెప్పిన డైలాగ్స్ క్రేజీగా ఉన్నాయి.
‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మాస్ లుక్ మైండ్ బ్లాక్..
మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. నువ్వో స్టెప్పేస్తే మైండ్ బ్లాక్' అంటూ జోష్‌గా పాట ఫ్యాన్స్‌కు గిలిగింతలు పెట్టేలా ఉంది.
శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్ కలిసి రాసిన ఈ పాటను బ్లేజ్, రొణినారెడ్డి పాడారు. ఈ ఆల్బమ్ లహరి మ్యూజిక్, టీ సీరిస్ ద్వారా మార్కెట్‌లోకి రానున్నది.
|
జనవరి 11వ తేదీన
సూపర్‌స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. ప్రత్యేక పాత్రలో విజయశాంతి, ఆమని నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలను అనిల్ రావిపూడి నిర్వర్తిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేష్ బాబు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామబ్రహ్మం సుంకర, శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుక కానుకగా జనవరి 11వ తేదీన చిత్రం విడుదల కానున్నది. తాజా పాట కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి..