పదకొండో శతాబ్దం నాటి గద్యం.. ఇళయారాజాతో మోహన్ బాబు
మంచు ఫ్యామిలీ హవా ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. అందరూ ఫ్లాపుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. మంచు విష్ణు, మనోజ్, మోహన్ బాబు, మంచు లక్ష్మీ ఇలా అందరూ కూడా ఒక్క సక్సెస్ కోసం ఎంతో ఆత్రుతగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మంచు వారింట్లో సక్సెస్‌లు తాండవం చేసేలానే కనిపిస్తోంది. మంచు విష్ణు మోసగాళ్లు, శ్రీను వైట్లతో చేసే సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక మోహన్ బాబు కూడా కొత్త కథతో సన్ ఆఫ్ ఇండియా అంటూ దేశ భక్తిని రేకెత్తించేందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. సన్ ఆఫ్ ఇండియా సినిమాకు ఇళయరాజాతో సంగీతాన్ని అందిస్తున్నట్టు.. పదకొండో శతాబ్దం నాటి వేదాంత దేశికలోని రఘువీర గద్యానికి ట్యూన్ కట్టమని మోహన్ బాబు కోరినట్టు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో మోహన్ బాబు అవలీలగా దాన్ని వినిపించాడు.

నువ్ పాడతావా? అంటూ మోహన్ బాబును ఇళయరాజా ఆటపట్టించాడు. తాను ఎలాంటి డైలాగ్‌నైనా చెప్పగలను గానీ పాడటం అంటే కష్టమని మోహన్ బాబు అన్నాడు. ఇది గద్యం దీనికి ట్యూన్ కట్టడం చాలా కష్టం అంటూ ఇళయరాజా అంటే..మీ వల్ల కానిది ఏదీ ఉండదంటూ మోహన్ బాబు అన్నాడు. మొత్తానికి ఇళయరాజా మాత్రం అదిరిపోయే ట్యూన్‌ను ఇచ్చేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. డైమండ్ రత్నం బాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











