twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క నిర్ణయంతో దేవిశ్రీప్రసాద్ తలరాతే మారిపోయింది.. 17ఏళ్ళకే ఫస్ట్ ఛాన్స్.. ఇళయరాజాను కాదని..

    |

    రాక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దేవిశ్రీప్రసాద్ గత 20 ఏళ్ళుగా నాన్ స్టాప్ గా మ్యూజిక్ వాయిస్తున్నాడు. ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో వర్క్ చేసిన దేవి అంటే అందరికి ఇష్టమే. సినిమాల రిజల్ట్స్ తో సంబందం లేకుండా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. అయితే దేవిశ్రీప్రసాద్ కు మొదటి ఛాన్స్ చాలా విచిత్రంగా వచ్చింది. అతనికి మొదటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఎమ్ఎస్.రాజు ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

     80కి పైగా సినిమాలు

    80కి పైగా సినిమాలు

    దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి సినిమా చేసినా కూడా కంటెంట్ కు తగ్గట్లుగానే ట్యూన్స్ కంపోజ్ చేస్తుంటాడు. మాస్ సాంగ్స్ తో పాటు లవ్ సాంగ్స్ తో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. మెగాస్టార్ నుంచి నాని వైష్ణవ్ తేజ్ వరకు దాదాపు అందరి హీరోలతో వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే 20 ఏళ్ళ కెరీర్ లో 80కి పైగా సినిమాలు చేశాడు.

    సీనియర్ రైటర్ తనయుడిగా..

    సీనియర్ రైటర్ తనయుడిగా..

    దేవిశ్రీప్రసాద్ అసలు పేరు ప్రసాద్ మాత్రమే. కానీ మొదటి సినిమా దేవికి మ్యూజిక్ అందించడంతో అలా దేవి శ్రీ ప్రసాద్ గా పేరును ఇష్టంగా మార్చేసుకున్నడు. సీనియర్ రైటర్ సత్యమూర్తి తనయుడు కావడంతో పెద్ద పెద్ద సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఎక్కువగా మణిశర్మ దగ్గర వర్క్ చేశాడు.

    దేవి సినిమా కోసం

    దేవి సినిమా కోసం

    దేవి శ్రీ ప్రసాద్ కు మొదటి అవకాశం చాలా విచిత్రంగా వచ్చిందట. ఆ విషయాన్ని నిర్మాత ఎమ్ఎస్.రాజు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయన మాట్లాడుతూ.. కోడి రామకృష్ణతో దేవి సినిమా ఫిక్స్ అయినప్పుడు మొదట దేవిశ్రీప్రసాద్ ను అనుకోలేదు. చాలామందిని అనుకున్నామని చెప్పారు.

    ఫస్ట్ ఇళయరాజాను అనుకున్నాం..

    ఫస్ట్ ఇళయరాజాను అనుకున్నాం..


    ఇళయరాజాను ఫిక్స్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా డిమాండ్ చేశారు. ఇక ఆయనను ఫిక్స్ చేద్దామా వద్దా అని అనుకుంటున్న సమయంలో సత్యమూర్తితో స్నేహం ఉండడం వలన ఆయన ఇంటికి సరదాగా వెళ్ళాను. మాట్లాడిన తరువాత బయటకు వెళ్లిపోదామని అనుకున్న తరుణంలో లోపల నుంచి కీ బోర్డ్ ప్లే చేస్తున్న సౌండ్ వినిపించింది.

    Recommended Video

    Prabhas : పొందిన సాయం మర్చిపోని ప్రభాస్.. ఆ హీరో కి డార్లింగ్ అండ | Radhe Shyam || Oneindia Telugu
     సినిమా చేస్తున్నావు అనగానే

    సినిమా చేస్తున్నావు అనగానే


    వెంటనే రూమ్ లోకి వెళ్లి చూస్తే దేవి శ్రీ ప్రసాద్. ఏవైనా సాంగ్స్ కంపోజ్ చెయ్యమని చెప్పాను. ఆ తరువాత ఒక సాంగ్ కంపోజ్ చేసి వినిపించగానే నాకు బాగా నచ్చేసింది. అది ఇంతవరకు ఏ సినిమాలో పెట్టలేదు గాని చాలా బావుంటుంది. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ ను దేవి సినిమాకి సెలెక్ట్ చేశాము. నువ్వు సినిమా చేస్తున్నావు అనగానే నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. సత్యమూర్తి కళ్ళొల్లో నీళ్లు కూడా చూశాను. అప్పుడు అతని వయసు 17 ఏళ్ళు మాత్రమే. దేవి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు ఇక ఆ తరువాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట వంటి సినిమాలకు మా ప్రొడక్షన్ లోనే వర్క్ చేశాడు అని నిర్మాత ఎమ్ఎస్.రాజు వివరణ ఇచ్చారు.

    English summary
    In 2003, Mahesh Babu made a movie okkadu along with nijam in Teja Direction. Mahesh has objected to the fact that Gopichand is not a villain in both films, with almost two films being admitted at the same time. After Prakash Raj has been selected in gopichand place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X