Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాలీవుడ్ సినిమాలు అందుకే చేయట్లేదు.. అలాంటి పని చేయలేనని పారిపోయి వచ్చేసా: థమన్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీగా మ్యూజిక్ అందిస్తున్న టాప్ దర్శకులలో థమన్ ఒకరు. పోటీగా దేవిశ్రీప్రసాద్ ఉన్నప్పటికీ కూడా థమన్ అత్యధిక అవకశాలు అందుకుంటూ ఉన్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. వీలైనంత వరకు మంచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవడానికి థమన్ ఆసక్తిని చూపిస్తున్నాడు. అయితే థమన్ ప్రతిభను చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆ మధ్య రెండు మూడు సినిమాలకు పనిచేసి మళ్లీ చేయలేనని అక్కడినుంచి వచ్చేసాడు. ఆ విషయంపై ఇటీవల థమన్ క్లారిటీ ఇచ్చాడు.

సక్సెస్ లో కీలక పాత్ర
సంగీత దర్శకుడు తమన్ ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ సినిమా సక్సెస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిత్రయూనిట్ సభ్యులు ఎవరు కూడా సోషల్ మీడియాలో లేకపోయినా కూడా తనే ముందుండి ఇంటర్నెట్ ప్రపంచంలో సినిమాలకు భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాడు

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే..
ఇటీవల విడుదలైన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది అంటూ ప్రతి ప్రేక్షకుడు కూడా ఎంతగానో ప్రశంసలు కురిపించారు.

బాలీవుడ్ లో కూడా..
ప్రస్తుతం థమన్ చేతిలో అయితే పెద్ద సినిమాలే ఉన్నాయి. అయితే ఆ మధ్యలో కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. గోల్ మాల్ సినిమాలో ఒక పాటను అలాగే సింబా సినిమాలో మరో రెండు పాటలను కంపోజ్ చేసి సినిమా మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు. మరి కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తుండడంతో ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే వాటిని కూడా కొనసాగించాడు. అయితే బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ థమన్ కు ఏమాత్రం నచ్చడం లేదట. అక్కడ చేయలేక పారిపోయి వచ్చేసాను అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

అందుకే బాలీవుడ్ లో చేయలేకపోయా
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాలు చేయడానికి ఇష్టమే కానీ అక్కడ ఒకే సినిమాకు ఐదారు మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం నాకు నచ్చలేదు. చేస్తే సినిమాకు ఒక్కడినే ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే చేయాలి అనే విధంగా ఆలోచిస్తాను. కానీ ఒకేసారి అంతమంది వర్క్ చేస్తే మనకు చేసిన సంతృప్తి కూడా ఉండదు. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ విధంగా చేయలేను అని పారిపోయి వచ్చేసాను అని తమన్ వివరణ ఇచ్చాడు.

పెద్ద సినిమాలతో బిజీబిజీగా..
ప్రస్తుతం థమన్ చేతిలో అయితే పెద్ద సినిమాలే ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమామా తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా సెలెక్ట్ అయ్యాడు. ఇక తమిళంలో విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరపైకి రాబోయే సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందించబోతున్నారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలపై కూడా త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నాడు.