For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్ళీ పెరుగుతున్న థమన్ రెమ్యునరేషన్.. నేషనల్ అవార్డుతో మరో రేంజ్!

  |

  సంగీత దర్శకుడు థమన్ ఇటీవల నేషనల్ అవార్డుతో మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో జనాల్లో హాట్ టాపిక్ మారుతున్న థమన్ అల.. వైకుంఠపురములో సినిమాకు ఈ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా ద్వారానే మొదటిసారి జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో సినీ ప్రముఖులందరూ కూడా అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో థమన్ కు సంబంధించిన పారితోషికం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక థమన్ ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు అనే వివరాల్లోకి వెళ్తే..

  కష్టపడి..

  కష్టపడి..

  చిన్నతనం నుంచి సంగీతాన్ని చాలా బాగా అలవాటు చేసుకున్న థమన్ అనుకున్న కలను సాధించడం కోసం చాలా హార్డ్ వర్క్ చేసాడు అని చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర కూడా ఎన్నో ఏళ్లుగా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. కీబోర్డ్ ప్లేయర్ గా అలాగే బ్యాండ్ వాయించడం కంపోజింగ్ లో సహాయంగా ఉండడం ఇలా ఎన్నో పొజిషన్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అందరికీ దగ్గర అయ్యాడు.

  నటుడిగా కూడా

  నటుడిగా కూడా

  మణిశర్మ, కోటి, ఏఆర్ రెహమాన్ ఇలా ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పనిచేసిన థమన్ మధ్యలో నటుడుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ తన గమ్యం అది కాదు అని సంగీత దర్శకుడుగానే గుర్తింపు అందుకోవాలని మళ్ళీ మ్యూజిక్ వైపు యూ టర్న్ తీసుకున్నాడు. బాయ్స్ సినిమాలో థమన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అతనికి ఆఫర్స్ వచ్చినప్పటికీ సినిమాల్లో చేయలేదు.

  ఆ సినిమా నుంచి

  ఆ సినిమా నుంచి

  ఇక మొదట కిక్ సినిమాతో అతని లైఫ్ ఒక్కసారిగా గా యూ టర్న్ తీసుకుంది. ఆ సినిమాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నప్పటికీ కూడా రవితేజ సహకారంతో మొదటిసారి అవకాశం అందుకున్నాడు. సినిమా సక్సెస్ కావడంతో అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులందరితో అలాగే స్టార్ హీరోలతో సినిమాలను చేసేలా అవకాశాలు అందుకున్నాడు.

   విడుదల కంటే ముందే..

  విడుదల కంటే ముందే..

  థమన్ ఎప్పుడైతే త్రివిక్రమ్ తో కలిశాడో అప్పటినుంచి అతని సరికొత్త కెరీర్ మొదలయింది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా మ్యూజిక్ సినిమా విడుదల కంటే ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది.

   నేషనల్ అవార్డ్

  నేషనల్ అవార్డ్

  అయితే మ్యూజిక్ విభాగంలో థమన్ ఆ సినిమాకు గాను అవార్డు సొంతం చేసుకుంటాడు అని ఎవరు ఊహించలేదు. నిజానికి అల.. వైకుంఠపురములో సినిమా ఏదో ఒక విభాగంలో నేషనల్ అవార్డ్ సాధిస్తుంది అని అభిమానుల్లో ముందుగానే ఒక నమ్మకం ఉంది. ఇక తమన్ నేషనల్ అవార్డు అందుకోవడంతో ఒక్కసారిగా అతని రేంజ్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో థమన్ కు ప్రముఖ సెలబ్రిటీలు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

  థమన్ రెమ్యునరేషన్

  థమన్ రెమ్యునరేషన్

  ఇక థమన్ పారితోషకం ప్రస్తుతం హై రేంజ్ లోనే ఉంది. మొన్నటి వరకు అతను పెద్ద సినిమాలకు రెండు కోట్ల వరకు అందుకుంటున్నట్లుగా టాక్ అయితే వచ్చింది. అయితే కంటెంట్ బాగుంటే మాత్రం చిన్న సినిమాలకు కోటి రూపాయలు తీసుకోవడానికి కూడా ఒప్పుకుంటున్నాడట. ఇక నేషనల్ అవార్డు రావడంతో పాటు నెక్స్ట్ మహేష్ 28వ సినిమా అలాగే రాంచరణ్ 15వ సినిమాలతో రెడీ అవుతున్నాడు కాబట్టి తప్పకుండా ఆ సినిమాలకంటే ముందే థమన్ రెమినరేషన్ రెండు కోట్లు దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  Read more about: ss thaman tollywood
  English summary
  Music director thaman remuneration news viral after national award..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X