‘ఏయ్ పిల్లా’ వచ్చేసింది.. రొమాంటిక్ మూడ్‌లో నాగ చైతన్య
శేఖర్ కమ్ముల మరో అద్భుతాన్ని సృష్టించబోతోన్నాడు. వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఫిదా అంటూ తెలుగు సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేశాడు. చాలా రోజుల తరువాత మంచి హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
మరో కొత్త ప్రేమకథను తన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడు. లవ్ స్టోరీ అంటూ నాగ చైతన్య, సాయి పల్లవిలను ప్రేమ పక్షుల్లా మార్చేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఆ ప్రివ్యూలోని ప్రతీ సీన్, ప్రతీ షాట్ ఎంతో అద్బుతంగా ఉందని కామెంట్స్ వచ్చాయి.

అంతలా హైప్ క్రియేట్ చేసిన ఆ పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు. పవన్ పీ హెచ్ సంగీతాన్నిఅందించగా.. చైతన్య పింగళి ఈ పాటను రచించారు. హరి చరణ్, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. చైతు సాయి పల్లవిల కెమిస్ట్రీ హైలెట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











