Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మన్మథుడు 2 నుంచి మరో పాట.. ఆకట్టుకుంటున్న చిన్మయి వాయిస్
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా సినిమా 'మన్మథుడు 2'. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మనసుకు హత్తుకునే మెలోడియస్ ట్యూన్ తో ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. నాగార్జున, రకుల్ చేతుల మీదుగా లాంచ్ చేయబడిన ఈ సాంగ్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగార్జున.. చేతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ ఇది అని పేర్కొన్నాడు.
నా.. లోన.. నీ వేన.. అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్‌కి శుభం విశ్వనాథ్ అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. చిన్మయి ఆలాపన ఈ మెలోడియస్ సాంగ్ లో హైలైట్ గా నిలుస్తోంది. నాగార్జున, రకుల్ ప్రీత్ మధ్య షూట్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చూపిస్తూ ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ సాంగ్ తో పాటు ఈ సాంగ్ కూడా బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

సాధారణం గానే హీరోయిన్లతో రొమాన్స్ చేసి సిల్వర్ స్క్రీన్ ట్రీట్ ఇవ్వడంలో నాగార్జునను మించిన తెలుగు హీరో లేరనే చెప్పుకోవచ్చు. ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో తన స్టయిలే వేరని మన్మథుడు 2 ప్రమోషన్స్ ద్వారానే మరోసారి నిరూపిస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన టీజర్స్ మన్మథుడు 2 రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు చెప్పకనే చెప్పేశాయి.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' మూవీ తెరకెక్కుతోంది. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.