For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మాస్ట్రో’ నుంచి అదిరిపోయే వీడియో: అంచనాలు పెంచుతోన్న ‘వెన్నెల్లో ఆడపిల్ల’

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఈ క్రమంలోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆరంభంలోనే ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి చంద్ర శేఖర్ ఏలేటి తెరకెక్కించిన 'చెక్' కాగా, వెంకీ అట్లూరి తీసిన 'రంగ్ దే' మరొకటి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలూ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మరో సినిమాను కూడా పూర్తి చేశాడు.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  ప్రస్తుతం హీరో నితిన్ నటించిన చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్‌లో భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. మేర్లపాక గాంధీ ఈ సినిమాను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్‌తో పాటు పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'వెన్నెల్లో ఆడపిల్ల' అనే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. అంధుడిగా ఉన్న నితిన్ కీబోర్డ్ వాయిస్తూ ఈ పాటను పాడుతుంటాడు.

  Nithiin Maestro Vennello Aadapilla Song Promo Released

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  అందమైన కథగా మొదలైన తన ప్రేమకథ.. చీకటిని మిగిల్చిందని బాధ పడుతూ హీరో పాడే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీన్ని స్వీకర్ అగస్థి ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఈ పాటను కృష్ణ చైతన్య, శ్రీజో రచించగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉందని ఈ సాంగ్ ద్వారా చూపించారు. దీంతో 'మాస్ట్రో' మూవీపై అంచనాలను ఇది అమాంతం పెంచేస్తోంది. ఇక, 'వెన్నెల్లో ఆడపిల్ల' పూర్తి పాటను ఆగస్టు 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

  క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'మాస్ట్రో'లో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Tollywood Youth Star Nithiin Now Doing Maestro Movie Under Merlapaka Gandhi Direction. Now Vennello Aadapilla Song Promo Released From This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X