Just In
- 6 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 6 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 7 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 8 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అల్లు అర్జున్‌పై అల్లు అయాన్ కంప్లైంట్స్.. త్రివిక్రమ్ స్కెచ్ అంటే ఇదీ! రియల్లీ సర్‌ప్రైజ్
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్.

బన్నీ అభిమానుల్లో కొత్త జోష్
గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రూపంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా మరో సింగిల్‌ను రిలీజ్ చేసి బన్నీ అభిమానుల్లో కొత్త జోష్ నింపారు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ స్కెచ్ అంటే ఇదీ అన్నట్లుగా..
సాధారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్కెచ్ వేస్తే దానికి తిరుగే ఉండదు. అలాంటి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బన్నీ అభిమానుల కోసం తన ఆలోచనకు మరింత పదును పెట్టి ఏకంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హను రంగంలోకి దించేశారు. ఈ మేరకు వారిపై షూట్ చేసిన సాంగ్ టీజర్ విడుదల చేశారు.

చిల్డ్రన్స్ డే కానుకగా.. ఓ మైగాడ్ డాడీ
బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు (నవంబర్ 14) 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని మూడో పాట `ఓ మైగాడ్ డాడీ` టీజర్ వదిలారు. ఈ టీజర్‌లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ స్పెషల్ గెస్ట్‌లుగా సందడి చేయడం బన్నీ అభిమానులను కనువిందు చేసింది.

మెగా ఫ్యాన్స్ సంబర పడేలా..
తండ్రి అల్లు అర్జున్‌పై అల్లు అయాన్ కంప్లైంట్స్ చేస్తున్నట్లుగా ఈ టీజర్ డిజైన్ చేశారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ కూడా ఈ టీజర్‌లో కనిపించి తన ఆటలతో అలరించింది. ఈ ఇద్దరు చిన్నారులు తమ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాంగ్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేయడం చూసి ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.
తమన్ సంగీతం.. రాహుల్ సిప్లిగంజ్ గానం
ఈ పాటకు తమన్ సంగీతం అందించగా.. రోల్ రిడా, రాహుల్ సిప్లిగంజ్, బ్రేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్‌లు ఆలపించారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. ఈ పాట పూర్తి వీడియో నవంబర్ 22వ తేదీన విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన 'అల.. వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానుంది.