Ram Pothineni జెట్ స్పీడ్‌తో బుల్లెట్ సాంగ్.. 60 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు
ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ది వారియర్ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన బుల్లెట్ సాంగ్‌కు య్యూట్యూబ్‌లో అపూర్వమైన స్పందన లభిస్తున్నది. అభిమానుల నుంచి ఈ పాట సొంతం చేసుకొంటున్న ఆదరణను చూసి సంగీత ప్రియులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. బుల్లెట్ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించడగా.. తమిళ సూపర్ స్టార్ శింబు, హరిప్రియ ఆలపించారు. పవర్‌పుల్ పాటకు రామ్ పోతినేని చేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.
ది వారియర్ సినిమాలోని బుల్లెట్ పాట ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ సాధించడం ఓ రికార్డుగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో పలు రకాల రికార్డులను బ్రేక్ చేసింది. రామ్ పోతినేనితో కీర్తీ శెట్టి వేసిన స్టెప్పులు ఇప్పుడు పలు సోషల్ మీడియా మాథ్యమంలో రీల్స్‌గా హల్‌చల్ చేస్తున్నాయి. బుల్లెట్ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో అందర్నీ ఆకట్టుకొంటూ రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తున్నది.

తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న యాక్షన్, ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బిగ్ స్క్రీన్లపై మ్యాజిక్ చేయడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లోను వ్యక్తమవుతున్నది. థియేటర్లలో ది వారియర్ చిత్రం పండుగ వాతావరణాన్ని నింపేందుకు జూలై 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.
నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, అక్షర గౌడ, ఆది పినిశెట్టి, నదియా, భారతీరాజా, చిరాగ్ జానీ, రెడిన్ కింగ్ల్సే, బ్రహ్మాజీ తదితరులు
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్
దర్శకత్వం: లింగుస్వామి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
రిలీజ్ డేట్: 2022-07-14


Click it and Unblock the Notifications











