Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హెబ్బా పటేల్ అందాల చిచ్చు.. డించక్ అంటూ రామ్ రచ్చ
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మణిశర్మ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వడంతో మళ్లీ మణిశర్మ హవా మొదలైంది. ఏకంగా చిరంజీవి ఆచార్య సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు. అలాంటి మణిశర్మ ఇప్పుడు ఎంత ఊపులో ఉండి ఉంటాడో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ బీట్లు కొట్టి రామ్ చేత హుషారు స్టెప్పులు వేయించాడు. అందుకే రామ్ తన ప్రస్తుత చిత్రం REDకి కూడా మణిశర్మనే మ్యూజిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.
రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని పెంచేలానే మణిశర్మ పాటలను అందించాడు. ఇప్పటికే విడుదలైన మెలోడీ పాట బాగానే క్లిక్ అయింది. ఇక తాజాగా మాస్ బీట్‌ను వదిలాడు. డించక్ డించక్ అంటూ రామ్ చేత మళ్లీ మాస్ స్టెప్పులు వేయించాడు. అప్పుడు దిమాక్ ఖరాబ్ చేయించిన మణిశర్మ ఇప్పుడు డించక్ అనిపిస్తున్నాడు. ఇందులో అదనంగా హెబ్బా పటేల్ అందాలు ఆకర్షిస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రామ్ స్పందిస్తూ.. ఇలాంటి మాస్ నంబర్‌ను ఇచ్చినందుకు మణిశర్మ గారికి థ్యాంక్స్.. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చినందుకు కాసర్ల శ్యామ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.. మరో లెవెల్‌కు తీసుకెళ్లారంటూ రామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పాటను సాకేత్ ఆలపించగా.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ మధ్యే RED సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్థిఫికెట్‌ను జారీ చేశారు. జనవరి 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతోన్నట్టు నిర్మాతలు ప్రకటించేశారు.
నటీనటులు:
రామ్,
నివేదా
పేతురాజ్,
మాళవికా
శర్మ,
అమృతా
అయ్యర్,
నాజర్
తదితరులు
సాంకేతిక
నిపుణులు:
సంస్థ:
శ‌్రీ
స్రవంతి
మూవీస్,
సంగీతం:
మణిశర్మ,
ఛాయాగ్రహణం:
సమీర్
రెడ్డి,
ఆర్ట్:
ఎ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్:
పీటర్
హెయిన్స్,
ఎడిటింగ్:
జునైద్,
సమర్పణ:
కృష్ణ
పోతినేని,
నిర్మాత:
'స్రవంతి'
రవికిశోర్,
దర్శకత్వం:
కిశోర్
తిరుమల.