twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగని అల వైకుంఠపురములో రికార్డులు.. ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్.. అంతా అతని మాయే

    |

    ఒక చిత్రం విడుదల కాకముందే ఇంతటి సంచలనాలు నమోదు చేయడం మామూలు విషయం కాదు. విడుదల చేసిన ఒక్కో పాట విడుదల చేస్తూ అంచనాలు పెంచేస్తూ ఉంది చిత్రబృందం. సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డాడీ అనే పాటలు సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలతోనే సినిమాను ఆకాశనికెత్తేలా చేసిన తమన్ సంగీతానికి అందరూ ఫిదా అవుతున్నారు.

    మ్యూజికల్ సెన్సేషన్..

    మ్యూజికల్ సెన్సేషన్..

    తమన్ నుంచి ప్రస్తుతం వస్తోన్న సంగీతంపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటిలా కాపీ క్యాట్ అనే కామెంట్లు అసలే వినబడటం లేదు. ప్రస్తుతం తమన్ ట్రెండ్ నడుస్తోందని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. దానికి కారణం ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపించడమే. తమన్ నుంచి వెంకీమామ, ప్రతి రోజూ పండగే లాంటి రెండు మ్యూజికల్ హిట్స్ రాగా రెండింటిలోనూ కొత్తదనమే చూపించాడు.

    ప్రత్యేకంగా నిలిచిన అల వైకుంఠపురములో

    త్రివిక్రమ్‌తో అరవింద సమేత చేసిన తమన్.. అలవైకుంఠపురములో చిత్రానికీ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట సామజవరగమన. ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగిలే ఉంటుంది. విడుదలైన క్షణం నుంచి నేటి వరకు వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో వంద మిలియన్లు, మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకుని మొదటి తెలుగు పాటగా రికార్డులు క్రియేట్ చేసింది.

    రాములో రాముల కూడా..

    రాములో రాముల కూడా..

    సామజవరగమన దండయాత్ర కొనసాగుతుండగానే రాములో రాముల అంటూ మరో సెన్సేషన్‌ను వదిలారు. రాములో రాముల అనే పాటకు చిన్న పిల్లలు సైతం స్టెప్పులేస్తున్నారంటే అది తమన్ మాయే. ఈ పాట సైతం వంద మిలియన్లను సొంతం చేసుకుంది. ఇలా ఓ హీరో నటించిన సినిమాలోని రెండు పాటలు వంద మిలియన్లను సొంతం చేసుకోవడమనే రికార్డు ఒక్క అల్లు అర్జున్‌కే దక్కింది. దీనంతటి కారణం తమన్ అందించిన అద్భుతమైన సంగీతమే. పాటలతోనే ఇంతగా ట్రెండ్ సెట్ చేస్తోన్న అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యాక ఇంకెంత హడావిడి చేస్తుందో చూడాలి.

    కేవలం నంబర్ కాదు..

    వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించడంతో అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘ఎంతో మంది పిల్లలు, పెద్దలు డ్యాన్సులు చేస్తోన్న వీడియోలను చూస్తున్నాను. ఈ పాట ఇంతమంది హృదయాలను దోచుకున్నందుకు సంతోషంగా ఉంది. వంద మిలియన్లు అనేది కేవలం నంబర్ కాదు.. అది మీరు చూపించే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు థన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.

    టీజర్‌ సైతం..

    టీజర్‌ సైతం..

    ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ సైతం యూట్యూబ్‌కు నిద్ర పట్టకుండా చేస్తోంది. స్టైల్‌గా ఉంది కదూ..? నాక్కూడా నచ్చింది.. మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌లోకి ఎక్కాను.. అనే బన్నీ మార్క్ డైలాగ్‌లు అదిరిపోగా.. త్రివిక్రమ్ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

    English summary
    Ramulo Ramula Song Crossed 100 Millions. Allu Arjun Ala Vaikunthaourramuloo Creates Wonders In Social Media. This Movie Is Directed By Trivikram. Music Is Composed By Thaman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X