For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Attasudake Song: సరికొత్త స్టెప్పులతో రవితేజ రచ్చ.. అట్టసూడకే అంటూ అదరగొట్టేశాడుగా!

  |

  చాలా ఏళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న తరుణంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెన్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఇది అతడిని హిట్ ట్రాక్ ఎక్కించడంతో పాటు కలెక్షన్లనూ భారీ స్థాయిలో వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచి లాభాలను కూడా బాగా అందుకుంది. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో ఉన్న రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

  Arjuna Phalguna Twitter Review: శ్రీవిష్ణు మూవీకి షాకింగ్ టాక్.. ఒక్కటే ప్లస్.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. అయితే, సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు ఆ దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేసేశాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా బ్యాలెన్స్ పార్ట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను విడుదల చేశారు.

  Ravi Tejas Khiladi Movie Attasudake Lyrical Song Released

  వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కొద్ది రోజుల క్రితమే 'ఖిలాడీ' మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'నువ్వంటే ఇష్టం' అంటూ సాగే ఈ సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి 'అట్టసూడకే' అంటూ సాగే పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. దీనికి శ్రీమణి లిరిక్స్ రాయగా.. దేవీ శ్రీ ప్రసాద్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు ఎంతో కొత్తగా ఉన్నాయి. దీంతో ఈ సాంగ్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. కానీ, విదేశాల్లో జరగాల్సిన షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించడం లేదు. దీంతో మాస్ మహారాజా అభిమానులు అయోమయంగా ఉన్నారు.

  రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. Now This Movie Attasudake Lyrical Song Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X