For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa: పాన్ ఇండియా సాంగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాక్ స్టార్.. ఎలా ఉంటుందంటే..?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప కూడా వారి స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రతోనే భారీ స్థాయిలో వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. చూస్తుంటే సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతోంది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇప్పటివరకు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏ సినిమా కూడా మ్యూజికల్ గా ఫ్లాప్ అయ్యింది లేదు. సినిమాల రిజల్ట్ ను పక్కన పెడితే ఇద్దరి మ్యూజికల్ కాంబో అన్ని కూడా బెస్ట్ ఆల్బమ్స్ అని చెప్పవచ్చు.

  ఇక వారితో పాటు అల్లుఅర్జున్ కలిస్తే ఆ పాటలు నేషనల్ వైడ్ గా వైరల్ అవ్వడం కామన్ గా వస్తున్నదే. ఆర్య 2 సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ అందులో రింగ రింగ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మొదటి నుంచే పుష్ప సినిమాపై అంచనాలను అమితంగా పెంచాలని దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ గట్టిగానే వేశాడు. పుష్ప మొదటి పాటకు సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్ది పీక.. అనే ఆ పాట మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐదు భాషల్లో 5 మంది సింగర్స్ తో ప్రత్యేకంగా పాడించారు. రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ మరొక వీడియో ద్వారా మొత్తం అదే విషయాన్ని వివరంగా చెప్పాడు.

  Rock star devi sri prasad about pushpa song latest promo

  ఈనెల ఆగస్టు 13న ఈ పాట అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుందని తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను టచ్ చేసింది లేదు. మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దీంతో రాక్ స్టార్ ఈ సినిమా మ్యూజిక్ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు. దాదాపు సుకుమార్ తో చేసిన సినిమాల పాటలు అన్నీ కూడా హిట్ అయినవే. సుకుమార్ అంటేనే అందులో పాటలు చాలా స్పెషల్ గా ఉంటాయి. పాటలతోనే సగం ప్రమోషన్ క్రియేట్ అవుతుంది. ఇక మరోసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులను అందుకోవాలని ఈ కాంబినేషన్ బలమైన టార్గెట్ ను సెట్ చేసుకుంది.

  ఇక పుష్ప సినిమాను మొదట ఈ ఏడాది ఆగస్టు లోనే విడుదల చేయాలని అనుకున్నారు. అనంతరం దసరా సమయంలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని ఆలోచించారు. కానీ ఆ ప్లాన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక షూటింగ్ పనుల కోసం కూడా ఇంకాస్త ఎక్కువ టైమ్ కావడం వలన సుకుమార్ డిసెంబర్ లో అయితే బెటర్ అని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. తప్పకుండా సినిమాను క్రిస్ మస్ కానుకగా విడుదల చేయవచ్చని సమాచారం. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Pushpa 1 movie grand release in 2021 christmas , The Allu Arjun-Sukumar combination was initially thought to be a love story but later clarified that the film was a mass movie with a first look. The film unit has given another official clarification on the release of this Pan India movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X