For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SP Balasubrahmanyam Birth Anniversary: బాలసుబ్రమణ్యం ప్రపంచ రికార్డు.. ఇలా చేసిన ఏకైక వ్యక్తి

  |

  దాదాపు నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో తిరుగులేని గాయకుడిగా వెలుగొందారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అద్భుతమైన గాత్రంతో ఎన్నో ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించిన ఆయన.. సుమారు నలభై వేలకు పైగా పాటలను పాడారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దేశంలోని ఎన్నో భాషల్లో ఆయన గొంతును వినిపించారు. ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు అవార్డులు, రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈరోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన క్షణాలను గుర్తు చేసుకుందాం

  బాలసుబ్రమణ్యం కుటుంబ నేపథ్యం

  బాలసుబ్రమణ్యం కుటుంబ నేపథ్యం

  ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, నాలుగు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత కూడా తెలుగు వాళ్లకు పరిచయం ఉన్నవాళ్లే. ఎస్పీ బాలసుబ్రమణ్యం వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు.

  సినిమాల్లోకి అలా ఎంటర్ అయ్యారు

  సినిమాల్లోకి అలా ఎంటర్ అయ్యారు

  మద్రాసులో ఏఎమ్ఐఈ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారాయన. ఆరంభంలోనే ఎంతగానో ఆకట్టుకున్న ఎస్పీబీ.. మంచి గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు.

  అలా కూడా గుర్తింపు పొందిన బాలు

  అలా కూడా గుర్తింపు పొందిన బాలు

  సింగర్‌గా కొన్ని వేల పాటలను పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మంచి గుర్తింపును అందుకున్నారు. ‘మన్మధలీలై' చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, రఘువరన్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు.

  నటుడిగానూ సత్తా.. అదుర్స్ అనేలా

  నటుడిగానూ సత్తా.. అదుర్స్ అనేలా

  1969లో వచ్చిన ‘పెళ్లంటే నూరేళ్ల పంట' అనే చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటుడిగా తన ప్రస్థానాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు. ఈ క్రమంలోనే పలుమార్లు ఉత్తమ సహాయ నటుడిగానూ నిలిచారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను చేశారు. చివరిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘దేవదాస్' చిత్రంలో నటించారు.

   కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు

  కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు

  మంచి టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందికి మార్గనిర్ధేశం చేయాలన్న లక్ష్యంతో బుల్లితెరపై పలు పాటల కార్యక్రమాలను సైతం ప్రారంభించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే తన శిష్యులుగా ఎంతో మందిని తయారు చేసి సినీ పరిశ్రమకు అందించారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన ఎంతో మంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సింగర్లుగా వెలుగొందుతున్నారు.

   జాతీయ అవార్డులు.. అవైతే లెక్కలే

  జాతీయ అవార్డులు.. అవైతే లెక్కలే

  నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా మెప్పించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే ఎన్నో రకాల అవార్డులను సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఇచ్చే అత్యున్నత అవార్డులను అందుకున్న ఆయన.. ‘ఏక్ దూజే కే లియే', ‘సాగర సంగమం', ‘స్వాతిముత్యం', ‘రుద్రవీణ' చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

  SP Balu Honoured With Padma Vibhushan | Singer Chithra Gets Padma Bhushan | Filmibeat Telugu
  ఎస్పీ బాలసుబ్రమణ్యం వరల్డ్ రికార్డ్

  ఎస్పీ బాలసుబ్రమణ్యం వరల్డ్ రికార్డ్

  సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో రకాలుగా మెప్పించి చిరకాలం గుర్తుండిపోయేలా కీర్తి ఘడించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే 11 భాషల్లో కలిపి 40 వేల పాటలు పాడారు. అదే సమయంలో 40 సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే ఏకంగా 29 నంది అవార్డులను దక్కించుకున్నారాయన.

  English summary
  Legendary Singer of India S. P. Balasubrahmanyam Birth Anniversary Today. In This Occasion.. Remembering Special Moments in his Life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X