For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరిత్ర సృష్టించిన సాయి పల్లవి: బన్నీ, పవన్ రికార్డులు బ్రేక్.. సౌత్‌లోనే ఏకైక స్టార్‌గా అరుదైన ఘనత!

  |

  ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది గ్లామరస్ బ్యూటీ సాయి పల్లవి. ఉన్నత చదువులు చదివినా.. డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించిందామె. వెండితెరపైకి అడుగు పెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ భామ.. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకుంటోంది. ఫలితంగా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సాయి పల్లవి టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. తద్వారా అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ రికార్డులు బ్రేక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం

  అక్కినేని హీరోతో సాయి పల్లవి లవ్ స్టోరీ

  అక్కినేని హీరోతో సాయి పల్లవి లవ్ స్టోరీ

  సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 16న ఇది విడుదల కాబోతుంది.

  ‘సారంగ దరియా' అంటూ వచ్చిన పల్లవి

  ‘సారంగ దరియా' అంటూ వచ్చిన పల్లవి

  ‘ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘లవ్ స్టోరీ'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఇందులోని ‘సారంగ దరియా' అనే తెలంగాణ పల్లె పదాలతో రూపొందిన పాట విడుదలైంది. సుద్దాల రాసిన దీనిని మంగ్లీ పాడింది.

  శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

  పాటతో వివాదం... దర్శకుడి లేఖతో బ్రేక్

  పాటతో వివాదం... దర్శకుడి లేఖతో బ్రేక్

  ‘దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అంటూ సాగే ఫోక్ సాంగ్‌ను గతంలో కోమలి అనే సింగర్ ఆలపించింది. ఇప్పుడు దీన్నే ‘లవ్ స్టోరీ' మూవీలో వాడడంపై పెద్ద వివాదమే చెలరేగింది. తనకు న్యాయం చేయాలని సదరు సింగర్ డిమాండ్ చేసింది. దీనిపై శేఖర్ కమ్ముల స్పందించడంతో సద్దుమణిగింది.

  సాంగ్‌తో చరిత్ర సృష్టించిన సాయి పల్లవి

  సాంగ్‌తో చరిత్ర సృష్టించిన సాయి పల్లవి

  ‘సారంగ దరియా' పాట యూట్యూబ్‌లో ఊహించని రెస్పాన్స్‌ను అందుకుంటోంది. సాయి పల్లవి మార్క్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ పాటకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తద్వారా 15 రోజుల్లో ఈ పాటకు 52 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, 8 లక్షలకు పైగా లైకులు కూడా రాబట్టిందీ సాంగ్. దీంతో టాలీవుడ్‌లో ఇది చరిత్ర సృష్టించింది.

  మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

  అల్లు అర్జున్ రికార్డు బ్రేక్.. సౌత్‌లో టాప్

  అల్లు అర్జున్ రికార్డు బ్రేక్.. సౌత్‌లో టాప్

  టాలీవుడ్‌లో వేగంగా 50 మిలియన్ వ్యూస్ అందుకున్న పాటగా అల్లు అర్జున్ బుట్టబొమ్మ (18 రోజులు) నిలిచింది. ఇప్పుడీ రికార్డును సాయి పల్లవి ‘సారంగ దరియా' సాంగ్ బ్రేక్ చేసింది. ఇది కేవలం 14 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. అలాగే, వేగంగా 700 లైకులు అందుకున్న పాటల్లోనూ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. దీని తర్వాత ‘బుట్టబొమ్మ', ‘రాములో రాములా', పవన్ ‘మగువా మగువా' సాంగ్స్ ఉన్నాయి.

  సౌత్‌లోనే ఏకైక స్టార్‌గా అరుదైన ఘనత

  సౌత్‌లోనే ఏకైక స్టార్‌గా అరుదైన ఘనత

  దక్షిణాదిలో వేగంగా 50 మిలియన్ల వ్యూస్ అందుకున్న పాటల్లో ‘మారి 2'లోని ‘రౌడీ బేబీ' సాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఇది 8 రోజుల్లో ఈ ఘనతను అందుకుంది. ఇప్పుడు దీని తర్వాతి స్థానంలో ‘లవ్ స్టోరీ' మూవీలోని ‘సారంగ దరియా' సాంగ్ వచ్చి చేరింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రెండు పాటల్లోనూ హీరోయిన్ సాయి పల్లవినే. తద్వారా సౌత్‌లో టాప్ స్టార్‌గా నిలిచిందామె.

  English summary
  Akkineni Naga Chaitanya is an Indian film actor known for his work in Telugu cinema. For his performances in various films, Chaitanya won several awards including Filmfare Award South for Best Debut, Nandi Award for Best Supporting Actor and SIIMA award for Best Actor Critics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X