Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Automobiles
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్వీన్ అంటూ కంగనాపై ప్రశంసలు.. సమంత ట్వీట్ వైరల్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. తలైవి నుంచి ఫస్ట్ సింగిల్‌ను తాజాగా సమంత వదిలింది. సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. గ్లామరస్‌గా సాగిన ఈ పాటలో కంగనా అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రెట్రో లుక్‌లో కంగనా అదిరిపోయింది. అయితే ఈ పాటను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. ఈ మేరకు కంగనా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
జయలలిత అమ్మ గ్రేజ్, అద్బుతమైన నటనగురించి అందరికీ తెలిసిందే. సినిమా నుంచి సీఎం వరకు ఆమె ప్రయాణం చూడండి అంటూ సాంగ్‌ను విడుదల చేసింది. ఇలా సమంత తన పాటను రిలీజ్ చేయడంతో కంగనా థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ వేసింది. పాటను విడుదల చేసినందుకు, మాకు మద్దతుగా ఉన్నందుకు థ్యాంక్స్ అని కంగనా తెలిపింది. అంతేకాకుండా సమంతను ప్రశంసల్లో ముంచెత్తింది.

మహిళా సాధికారతకు నువ్వో ఉదాహరణ.. మనల్ని మనం ఉద్దరించుకోవాలి.. అదే అసలైన ఫెమినిజం.. థ్యాంక్ అంటూ సమంతపై కంగనా కామెంట్లు చేసింది. కంగనా చేసిన కామెంట్లకు మద్దతిచ్చినట్టుగా సమంత ఎమోజీలను పెట్టేసి క్వీన్ అంటూ పొగిడేసింది. విబ్రి మీడియాపై విష్ణు వర్దన్ ఇందూరి శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తోన్న ఈమూవీని విజయ్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఇక చిత్రానికి జీవి ప్రకాష్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.