మరో ఆహ్లాదకరమైన పాట.. అంచనాలు పెంచేస్తోన్న ‘జాను’
తమిళనాడు షేక్ చేసిన సినిమా 96. విజయ్ సేతుపతి-త్రిష మ్యాజికల్ పర్ఫామెన్స్‌కు కోలీవుడ్ మొత్తం ఫిదా అయింది. భాషలకు అతీతంగా సినీ ప్రేమికులందరూ 96ను ఆకాశానికెత్తేశారు. కొందరైతే ఈ సినిమాను రీమేక్ చేయాలని ముచ్చట పడితే.. మరికొందరు మాత్రం ఆ సాహసం చేయలేమని చేతులెత్తేశారు. అయితే తెలుగు ప్రేక్షకులకు అందులోని ఫీల్‌ను పరిచయం చేయడానికి జానుగా రీమేక్ చేశాడు దిల్ రాజు.
ఇప్పటికే జానుపై అంచనాలు ఆకాశన్నంటాయి. రేపు (ఫిబ్రవరి 7) విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు. మామూలుగా 96 సినిమా అంటే గోవింద్ వసంత్ అందించిన సంగీతం, పాటలే అందరికీ గుర్తొస్తాయి. కాదలే కాదలే అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదల చేసిన జాను పాటలు కూడా అందరికీ బాగానే ఎక్కేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. అనంతం అనే ఈ పాటను శ్రీమణి రాయగా.. చిన్మయి, గోవింద్ పాడారు. కాలాల ప్రేమ .. పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా .. యుగాల ప్రేమ .. జగాల నేలుతోంది రాజులాగా .. శపించు వరమా అంటూ సాగే ఈ పాట బాగానే ఆకట్టుకుంటోంది. ఇక మరి జాను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











