రెండో పాటకు ‘శ్రీకారం’.. ‘సంక్రాంతి సందళ్లే’ అంటూ శర్వానంద్ రచ్చ
శర్వానంద్ గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎంతో పరితపిస్తున్నాడు. ఒక్క హిట్ కొట్టాలని తెగ ఆరాట పడుతున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరకు నిరాశే పడుతున్నాడు. జానర్లు మార్చినా కూడా ఫలితాలు మాత్రం మారడం లేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, రాధ ఇలా ఎన్నో సినిమాలు శర్వానంద్‌కు నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు మాత్రం శర్వానంద్ తన పంథాను మార్చకుండా.. ఇది వరకు తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ జానర్‌లోనే మరోసారి రాబోతోన్నాడు.
శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అన్నింటి కంటే ముందుగా వచ్చేది మాత్రం శ్రీకారం. ఇప్పటికే టీజర్, పోస్టర్, పాటతో హైప్ పెంచేసింది చిత్ర యూనిట్. భలేగుంది బాలా అంటూ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేశారు. ఈ ఒక్క పాటతోనే అందరినీ కట్టిపడేశారు. పెంచల్ దాస్ వాయిస్, రచన అందరినీ మరోసారి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ నుంచి రెండు పాట వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.

శ్రీకారం నుంచి సంక్రాంతి సందళ్లే అనే పాట రేపు (జనవరి 4) విడుదల కాబోతోందని తెలిపారు. సంక్రాంతి సందళ్లే అనే పాటకు సంబంధించిన ప్రోమోను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు తెలిపారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..కిషోర్ బి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











