Life of 3 దర్శకుడిగా శశి ప్రీతమ్.. నువ్వు నాకు నచ్చావే అంటూ..
సినీ పరిశ్రమలో ఉన్న బహుముఖ ప్రతిభాశాలి ఎవరైనా ఉన్నారంటే శశి ప్రీతమ్ తప్పకుండా గుర్తుకు వస్తారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, గేయ రచయితగా, సంఘ సేవకుండిగా, ఫిల్మ్ మేకర్‌గా పలు పాత్రలను పోషిస్తున్నారు. ఆయన మ్యూజిక్ అందించిన గులాబీ, సముద్రం, హ్యాండ్పప్, రాఘవ లాంటి చిత్రాలు ప్రేక్షకుల మనసు దోచుకొన్నాయి. హిందీలో కూడా ఆమ్‌దానీ ఆఠానీ, ఖర్చ రూపాయ, ముఖబీర్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇలా మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులైన శశి ప్రీతమ్ ఇప్పుడు సినీ దర్శకుడిగా మారారు.

ఆయన దర్శకత్వం వహించిన లైఫ్ ఆఫ్ 3 చిత్రంలో స్నేహాల్ కామత్, వైశాలి, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శశి ప్రీతమ్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు సినిమాటోగ్రఫిని, మ్యూజిక్, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయన కూతురు ఐశ్వర్య కృష్ణ ప్రియ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నువ్వు నాకు నచ్చావే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సరికొత్త రాగాలెందుకు వచ్చాయి..
ఎదలోన భావాలెందుకు తెచ్చాయి.
రంగులలో రంగుని ఎందుకు పెంచాయి..
ముందెన్నడు తెలియని హాయిని పంచాయి..
నువ్వేనా దీనికి మూలం..
తెలియని ఈ ఆరాటం.. తెలిసింది...
ఈ క్షణమే నీతో ఉంటేనే...
నవ్వు నాకు నచ్చావే..
నవ్వు నాకు నచ్చావే..
నవ్వు నాకు నచ్చావే..నచ్చావేఅంటూ
ఆహ్లాదంగా సాగే ఈ పాటకు శశి ప్రీతమ్ మరోసారి అందమైన బాణీలను సమకూర్చారు. గాయకుడు ఎన్‌సీ కారుణ్య ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియుల్ని అలరిస్తూ సోషల్ మీడియాలో మంచి స్పందనను చూరగొంటున్నది.
ఈ సందర్భంగా దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ ఈ కథ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల జీవితం గురించి ఉంటుంది. సినిమా పరిశ్రమకు చెందిన ముగ్గురు వ్యక్తులు దర్శకుడు, రచయిత, నటుడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇది హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది అని అన్నారు
నటీనటులు: స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ, వైశాలి, సౌజన్య వర్మ, సీవీఎల్, లోహిత్ కుమార్, వైభవ్ సూర్య, జోసెఫ్ సుందర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫి: శశి ప్రీతమ్
నిర్మాత: ఐశ్వర్య కృష్ణ ప్రియ
సహ నిర్మాత: దుశ్యంత్ రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: అశోక్ బడ్డి డాక్టర్ పెరుమాళ్లు మలినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విశ్వనాథం వి


Click it and Unblock the Notifications











