గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి.. ఇద్దరి యువకుల అరెస్ట్
ఇండియన్ టాప్ సింగర్ కైలాష్ ఖేర్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్‌లో ఆయనపై బాటిల్ విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో జరిగిన దాడిపై నిర్వాహకులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
కర్ణాటక ప్రభుత్వం హంపీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారులతో ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తున్నది. ఇటీవల ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్‌ను ఆహ్వనించి.. మ్యూజికల్ నైట్‌ను నిర్వహించారు. ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో కైలాష్ ఖేర్‌పై బాటిల్ విసిరి గాయపరిచేందుకు ప్రయత్నించారు. నిర్వాహకులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత వారిని విచారించారు.

అయితే కన్నడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హంపీ ఉత్సవాల్లో కైలాష్ ఖేర్ అన్నీ హిందీ పాటలే పాడుటం మాకు నచ్చలేదు. పలు మార్లు కన్నడ పాటలు పాడాలని చెప్పిన వినిపించకోలేదు. ఆయన పాటలను ఆపేందకు బాటిల్ విసిరాం అని యువకులు తమ అంసతృప్తిని వెళ్లగక్కాడు.
అయితే కన్నడ ఫంక్షన్‌కు హిందీ గాయకులను ఆహ్వనించడం సరికాదు. కన్నడ గాయకులను ప్రోత్సహిస్తే బాగుండేది అని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, కైలాష్ ఖేర్ బాలీవుడ్‌లో మంగళ్ పాండే, నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో పాటలు పాడారు. బాహుబలి చిత్రంలో జయ జయ కరా పాటతో మంచి పాపులారిటీని సంపాదించారు. మిర్చి సినిమాలో పండుగల తిగివచ్చావు పాటకు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకొన్నాడు.


Click it and Unblock the Notifications











