‘సొట్టబుగ్గల లావణ్య.. లవ్ చేస్తానే లావైనా’.. ఇంట్రెస్టింగ్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ పాట

యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్ లేక సతమవుతున్న సమయంలో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దీంతో మళ్లీ ఈ హీరోకు ఎనర్జీ వచ్చేసింది. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు.

నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ వంటి విజయాలు అందుకున్న సందీప్ కిషన్.. మరో కామెడీ ఎంటర్టైనర్‌తో ఆడియెన్స్‌ను పలకరించబోతోన్నాడు. ఏ1 ఎక్స్‌ప్రెస్ అంటూ రాబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. సింగిల్ కింగులం అనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Single Kingulam From A1 Express Goes Viral

రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను సామ్రాట్ రాశాడు. ధృవ ఫేమ్ హిప్‌హాప్ తమిజ సంగీతాన్ని అందించాడు. సొట్టబుగ్గల లావణ్య లవ్ చేస్తానే లావైనా.. అంటూ పాటలోని లిరిక్స్ సైతం ఫన్నీగా ఉండటం.. ట్యూన్ కూడా క్యాచీగా ఉండటంతో ఈ ఫస్ట్ సింగిల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్, వెంకటాద్రి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X